విరాట్ కోహ్లీ ఫామ్ గురించి క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చే జరుగుతోంది. క్రికెట్ ఆడుతున్న, మానేసిన ప్రతీ ఒక్కరూ విరాట్ కోహ్లీ గురించి ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మౌంటీ పనేసర్, విరాట్ కోహ్లీ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు...
2019 నవంబర్‌లో అంతర్జాతీయ కెరీర్‌లో 71వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయారు. ఈ ఏడాది వరుసగా విఫలమవుతూ భారత జట్టుకి భారంగా మారిపోయాడు...
211
ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 12 పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ, రెండో వన్డేలో 16 పరుగులు మాత్రమే చేసి కీలక సమయంలో అవుట్ అయ్యాడు. అంతకుముందు ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులోనూ ఆకట్టుకోలేకపోయాడు విరాట్ కోహ్లీ...
311
మూడు ఫార్మాట్లలోనూ 50కి పైగా సగటు మెయింటైన్ చేస్తున్న వచ్చిన విరాట్ కోహ్లీ వరుస ఫెయిల్యూర్స్ కారణంగా టెస్టుల్లో సగటు 49.53కి పడిపోయింది. గత ఏడాది విరాట్ సగటు అయితే కేవలం 30 మాత్రమే...
411
Image credit: Getty
గత ఏడాదిలో 10 టెస్టులు ఆడి 18 సార్లు బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ కేవలం 527 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సగటు 29.27 మాత్రమే. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి...
511
Ravi Shastri and Virat Kohli
‘విరాట్ కోహ్లీని టీమ్‌లో నుంచి తీసేయడం అంత తేలికయ్యే పని కాదు. ఎందుకంటే అతను ఓ ప్లేయర్ మాత్రమే కాదు, ఓ బ్రాండ్... వరల్డ్‌లోనే మోస్ట్ మార్కెటబుల్ క్రికెటర్...
611
సచిన్ టెండూల్కర్ తర్వాత విరాట్ కోహ్లీ మాత్రం జనాల్లో ఇంతటి పాపులారిటీ తెచ్చుకోగలిగాడు. విరాట్ కోహ్లీ టీవీ మీద కనిపిస్తే చాలు కాసుల పంట కురుస్తుంది. అందుకే విరాట్ కోహ్లీ తప్పిస్తే బీసీసీఐ, కోట్లలో నష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి...
711
Virat Kohli
విరాట్ కోహ్లీ క్రీజులో ఉండే విధానం ప్రతీ ఒక్కరినీ నచ్చుతుంది. అతను ప్రతీ మూమెంట్‌ని పూర్తిగా ఎంజాయ్ చేస్తాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలోనూ విరాట్ కోహ్లీకి వీరాభిమానులు ఉన్నాయి...
811
Sanjay Manjrekar-Virat Kohli
కేవలం భారత క్రికెట్ బోర్డు మాత్రమే కాదు మిగిలిన క్రికెట్ బోర్డులు కూడా విరాట్ కోహ్లీ పేరు చెప్పి చాలా సంపాదించుకున్నాయి. అతన్ని చూపించి స్పాన్సర్లను రాబట్టుకున్నాయి...
911
అయితే విరాట్ కోహ్లీ జట్టులో ఉంటే ఫైనాషియల్ కోణంలోనూ క్రికెట్‌కి ఎంతో అవసరం. ఇప్పుడు బీసీసీఐ చేయాల్సిందల్లా అతన్ని ఫామ్‌లోకి ఎలా తేవాలా? అని మాత్రమే. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ వస్తున్న టైమ్‌లో మరిన్ని డబ్బులు సంపాదించుకోవాలనే ఏ బోర్డు అయినా ఆలోచిస్తుంది...
1011
Virat Kohli
ఇప్పుడు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలపైనే ఎక్కువ భారం ఉంటుంది. రొనాల్డో, మాంచెస్టర్ యూనైటెడ్‌కి ఆడడం మొదలెట్టిన తర్వాత అందరూ ఫుట్‌బాల్ చూడడం మొదలెట్టారు. అలాగే ఆర్‌సీబీకి అంత క్రేజ్ రావడానికి విరాట్ కోహ్లీయే కారణం...
1111
విరాట్ కోహ్లీ బ్రాండ్‌ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే బీసీసీఐ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. విరాట్‌ని పక్కనెబట్టాలనే ఆలోచన బీసీసీఐ చేస్తుందనైతే నేను అనుకోను...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మౌంటీ పనేసర్..