రాబిన్ ఊతప్ప ఫ్యామిలీలోకి క్యూట్ గర్ల్... నువ్వు మమ్మల్ని తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు...

Published : Jul 15, 2022, 06:38 PM IST

భారత క్రికెటర్ రాబిన్ ఊతప్ప రెండోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య శీతల్ ఊతప్ప ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 2016లో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ ఇద్దరికీ ఇప్పటికే ఓ కొడుకు ఉన్నాడు. తన క్యూట్ అండ్ స్వీట్ ఫ్యామిలీతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు రాబిన్ ఊతప్ప...

PREV
16
రాబిన్ ఊతప్ప ఫ్యామిలీలోకి క్యూట్ గర్ల్... నువ్వు మమ్మల్ని తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు...

‘ప్రేమ నిండిన మా హృదయాలతో మా జీవితాల్లోకి వచ్చిన సరికొత్త ఏంజెల్‌ని పరిచయం చేస్తున్నాడు. ఇదిగో త్రినిటీ తియా ఊతప్ప... నువ్వు ఈ ప్రపంచంలోకి రావడానికి మమ్మల్ని తల్లిదండ్రులుగా, నీ అన్నని సోదరుడిగా ఎంచుకున్నందుకు ఎంతగానో గొప్పగా ఫీల్ అవుతున్నాం...’ అంటూ కాప్షన్ జత చేశాడు రాబిన్ ఊతప్ప...

26

ఐపీఎల్ 2022 సీజన్‌లో సత్తా చాటిన సీనియర్లలో సీఎస్‌కే ఓపెనర్ రాబిన్ ఊతప్ప కూడా ఒకడు. 12 మ్యాచుల్లో 20.91 సగటుతో 230 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప, మిగిలిన సీఎస్‌కే సీనియర్ ప్లేయర్ల కంటే పర్వాలేదనిపించాడు... 

36

15 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న అతికొద్ది మంది ప్లేయర్లలో ఒకడైన రాబిన్ ఊతప్ప, అంతర్జాతీయ కెరీర్‌లో మాత్రం అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయాడు... తన కెరీర్‌లో 46 వన్డేలు, 12 టీ20 మ్యాచులు ఆడిన ఊతప్ప, చివరిగా 2015లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.. 

46

భారత జట్టుకు దూరమై, రాబిన్ ఊతప్ప డిప్రెషన్‌కి గురైన సమయంలో అతనికి అండగా నిలిచి, ధైర్యం చెప్పింది శీతల్ గౌతమ్... దేశవాళీ క్రికెట్‌లో రెండు సెంచరీలు, ఐపీఎల్ పర్ఫామెన్స్‌తో  తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవడానికి కూడా శీతల్‌ ఇచ్చిన మోరల్ సపోర్టే కారణమంటాడు రాబిన్ ఊతప్ప...

56

క్రైస్తవ మతానికి చెందిన శీతల్, రాబిన్ ఊతప్పను పెళ్లాడిన తర్వాత హిందూ మతాన్ని స్వీకరించింది. అయితే ఊతప్ప ఇంట్లో ఇరు మతాలను గౌరవిస్తూ ఆచరిస్తారు.

66
Robin Uthappa

ఐపీఎల్ 2022 మెగా వేలంలో రాబిన్ ఊతప్పని బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... 

click me!

Recommended Stories