IND vs NZ Final మ్యాచ్‌కు గ్రౌండ్ రెడీ - ఇండియా, పాక్ ఆడిన గ్రౌండేనా? పిచ్ ఎలా వుండనుంది?

Published : Mar 08, 2025, 09:17 AM ISTUpdated : Mar 08, 2025, 09:38 AM IST

ICC Champions Trophy 2025 IND vs NZ Final: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కు గ్రౌండ్ రెడీ అయింది. మరి పిచ్ ఎలా వుండనుంది? బ్యాటింగ్ సునామీ ఉంటుందా? బౌలింగ్ మాయాజాలం పనిచేస్తుందా? పిచ్ రిపోర్టు వివరాలు ఇవిగో !

PREV
16
IND vs NZ Final మ్యాచ్‌కు గ్రౌండ్ రెడీ - ఇండియా, పాక్ ఆడిన గ్రౌండేనా? పిచ్ ఎలా వుండనుంది?

ICC Champions Trophy 2025 IND vs NZ Final: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్ పోరుకు రంగం సిద్దమైంది. అద్భుతమైన ఆటతో ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంది. ఇండియా, న్యూజిలాండ్ జట్లు మూడోసారి ఫైనల్‌లో తలపడుతున్నాయి.

2000, 2021లో కూడా ఈ జట్లు తలపడ్డాయి. ఎలాగైనా రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని గెలుచుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటివరకు ఒక్క ఓటమి లేకుండా భారత జట్లు అజేయంగా ఫైనల్ కు చేరుకుంది. అలాగే, న్యూజిలాండ్ జట్లు సైతం అద్భుతమై ఆటతో ఫైనల్ పోరుకు చేరుకుంది. 

26
ఇండియా-న్యూజిలాండ్ ఫైనల్

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్

ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఏ గ్రౌండ్‌లో జరుగుతుందో అని అందరూ ఎదురు చూశారు. ఇప్పుడు ఆ గ్రౌండ్ ఫిక్స్ అయింది. ఇండియా, పాకిస్తాన్ ఆడిన గ్రౌండ్‌లోనే ఈ మ్యాచ్ జరుగుతుంది. అంటే దుబాయ్ లోని దుబాయ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ గ్రౌండ్ ఎలా వుండనుంది? పిచ్ రిపోర్టు ఏం చెబుతోంది. ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? భారత్ విజయావకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

36
ఇండియా vs న్యూజిలాండ్ ఫైనల్ పిచ్ రెడీ

దుబాయ్ స్టేడియం పిచ్ ఎలా వుండనుంది?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ కు వేదికైన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పిచ్ రిపోర్టుల ప్రకారం.. ఈ గ్రౌండ్ స్లోగా ఉంటుందని అనుకుంటున్నారు. ఇంటే ఇక్కడ భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశాలు తక్కువ. భారత తన అన్ని మ్యాచ్ లను ఇక్కడే ఆడింది. ఇంతకుముందు, ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 241 రన్స్ చేసింది. ఇండియా 244 రన్స్ చేసి గెలిచింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ కొట్టాడు.

46
ఇండియన్ క్రికెట్ టీమ్, ఏషియానెట్ న్యూస్ తెలుగు

ఇండియా ఆడిన నాలుగు మ్యాచ్ లకు వేరువేరు పిచ్ లు.. రిజల్ట్ ఒక్కటే !

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు తన అన్ని మ్యాచ్ లను దుబాయ్ స్టేడియంలో ఆడుతోంది. టోర్నమెంట్‌లో ఇక్కడ జరిగిన మునుపటి నాలుగు ఇండియా మ్యాచ్‌ల పిచ్‌ల మాదిరిగానే పిచ్ వుండవచ్చు. 'సెమీ-ఫ్రెష్' పిచ్ ఖచ్చితంగా కొత్తగా ఉండదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.  అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఇక్కడ జరిగిన 3 మ్యాచ్‌లకు 3 వేర్వేరు పిచ్‌లను ఉపయోగించారు.  ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లలో వేరువేరు పిచ్ లపై ఆడారు. ఆదివారం జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో కోసం చివరి మ్యాచ్ ఆడిన పిచ్ కాకుండా వేరే పిచ్ పై ఆడనున్నారు. అంటే దీనిపై చివరి 14 రోజుల క్రితం ఆడినది. దీనిని "సెమీ-ఫ్రెష్" అని పిలుస్తున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొత్తం 10 పిచ్‌లు ఉన్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇందులో నాలుగు భారత్ ఆడిన మ్యాచ్ ల కోసం ఉపయోగించారు. అయితే, అన్ని పిచ్ లపై భారత జట్టు బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించి విజయాన్ని అందుకోవడం విశేషం. 

56
న్యూజిలాండ్ క్రికెట్ టీమ్, టీమ్ ఇండియా

స్పిన్ బౌలర్ల బంగారం లాంటి పిచ్ !

దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియం స్పిన్ బౌల‌ర్ల‌ల‌కు బంగారం లాంటి పిచ్ అని చెప్పొచ్చు. ఇక్క‌డ 10 పిచ్ లు ఉన్న‌ప్ప‌టికీ అవ‌న్నీ కూడా స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్ ల‌లో ఇది స్ప‌ష్టంగా క‌నిపించింది. ఈ గ్రౌండ్ స్పిన్ బౌలింగ్‌కు బాగా సూట్ అవుతుంది. 

భార‌త్ - పాక్ మ్యాచ్ లో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జడేజా 5 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి ఆడలేదు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా టాస్ ఓడిపోయింది.  ఆడిన అన్ని మ్యాచ్ ల‌ను గెలిచింది. మొత్తంగా చెప్పాలంటే దుబాయ్ గ్రౌండ్ బౌలర్లకు అనుకూలంగా ఉంది. దుబాయ్ గ్రౌండ్‌లో జరిగిన 4 మ్యాచ్‌ల స్కోర్లు 228, 231, 241, 244, 249, 205, 264, 267 ప‌రుగులు. యావరేజ్ స్కోర్ 246 ప‌రుగుల‌గా ఉంది. అంటే మొత్తంగా 300 ప‌రుగులు చేయ‌డం క‌ష్టంతో కూడుకున్న ప‌ని. 260 నుంచి 270 ప‌రుగుల మ‌ధ్య చేసిన జ‌ట్టు గెలిచే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. 250 ప‌రుగులు చేసిన జ‌ట్టు కూడా త‌మ బౌలింగ్ తో పోటీలో వుండ‌వ‌చ్చ‌ని ఇది వ‌ర‌కు జ‌రిగిన కొన్ని మ్యాచ్ లు కూడా రుజువు చేశాయి. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ జ‌ట్టుకు బ్యాటింగ్ చేయ‌డం ఇక్క‌డ అంత ఈజీ కాదు.

66
ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఇండియా vs న్యూజిలాండ్ ఫైనల్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో ఎవరు గెలుస్తారు?  

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ లో భారత్, న్యూజిలాండ్ గెలుపు అవకాశాలు గమనిస్తే టీమిండియానే ఫేవరేట్. ఎందుకంటే ఇప్పటివరకు ఈ ఐసీసీ టోర్నమెంట్ లో భారత జట్టు ఆడిన అన్ని మ్యాచ్ లలో విజయం సాధించింది. టాస్ కీలకంగా ఉన్న దుబాయ్ స్టేడియంలో భారత్ ఇప్పటివరకు టాస్ గెలవలేదు కానీ అన్ని మ్యాచ్ లలో విజయం సాధించింది. అంటే భారత జట్టు టాస్ తో సంబంధం లేకుండా విజయపరంపరను కొనసాగిస్తోంది. అలాగే, గ్రూప్ దశలో భారత్-న్యూజిలాండ్ లు ఒక మ్యాచ్ లో తలపడ్డాయి. అక్కడ భారత జట్టే విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం న్యూజిలాండ్ తో ఫైనల్ పోరుకు మంచి జోష్ లో కనిపిస్తోంది.   అలాగే, భారత బౌలింగ్ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉంది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ బౌలింగ్‌ న్యూజిలాండ్‌ ను దెబ్బకొడుతుందని భావిస్తున్నారు. గిల్, రోహిత్, విరాట్, అయ్యర్, కేఎల్ రాహుల్ లతో భారత బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది.  

అయితే, న్యూజిలాండ్ జట్టు గ్రూప్ మ్యాచ్ లో భారత జట్టుపై ఓడినప్పటికీ అద్భుతమైన కమ్ బ్యాక్ తో సెమీస్ లో బలమైన సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్ తో ఫైనల్ తామే అర్హులమని నిరూపించింది. కీవీస్ జట్టులో సెంచరీల మోత మోగిస్తున్న రచిన్ రవీంద్ర, విల్ యంగ్ లు కీలకం కానున్నారు. అలాగే, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ లతో బలమైన బ్యాటింగ్ లైనప్ ను కలిగి ఉంది. బౌలింగ్ లో భారత్ ను ఇబ్బంది పెట్టే మిచెల్ సాంటర్న్, మ్యాట్ హెన్నీలు కీలకం అవుతారు. మొత్తంగా చూస్తే ఫైనల్ మ్యాచ్ ఇరు జట్ల గ్రూప్ మ్యాచ్ లా కాకుండా నువ్వా నేనా అనే పోటీ కనిపిస్తుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories