టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాళ్లలో ఒకడు. కోహ్లీ బ్యాటింగ్, ఫిట్‌నెస్, క్రమశిక్షణలో బెంచ్‌మార్క్‌లు సెట్ చేశాడు. చాలా మందికి స్ఫూర్తినిచ్చాడు. ఈ ఆటగాడు తన దూకుడు బ్యాటింగ్‌కు, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి బాగా ప్రయత్నిస్తాడు.
2008లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా తరపున ఆరంగేట్రం చేశాడు విరాట్ కోహ్లీ. కొద్ది రోజుల్లోనే అన్ని ఫార్మాట్‌లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 36 ఏళ్ల ఈ ఆటగాడు 549 మ్యాచ్‌లలో 52.36 సగటుతో 27598 పరుగులు చేశాడు. ఇందులో 82 సెంచరీలు, 143 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 14000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. ఈ ఫార్మాట్‌లో వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా నిలిచాడు (287 ఇన్నింగ్స్‌లు).
విరాట్ కోహ్లీ తన విజయాలు, రికార్డులతో పాటు ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తన డైట్‌ను క్రమం తప్పకుండా పాటిస్తాడు. అతను హైడ్రేటెడ్‌గా ఉండటానికి తాగే బ్లాక్ వాటర్ చాలా ప్రత్యేకమైంది.