KL Rahul Top-5 Cricketers : వచ్చే గురువారం బంగ్లాదేశ్ తో భారత్ తొలి టెస్టులో తలపడనుంది. ఈ క్రమంలోనే జట్టును ప్రకటించిన బీసీసీఐ ప్లేయర్లకు కొద్ది సమయం విశ్రాంతినిచ్చింది. వచ్చే జూన్ లో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ను దృష్టి సారించిన భారత జట్టు తాజా హోమ్ సీజన్ ప్రారంభం కానుండటంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లు జాతీయ జట్టులోకి రావడం నెల రోజుల తర్వాత ఇదే తొలిసారి.
పాకిస్థాన్ లో 2-0తో చారిత్రాత్మక టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న తర్వాత బంగ్లాదేశ్ ఫుల్ జోష్ లో ఉంది. ఇప్పుడు ఆ జట్టును అంత తేలికగా తీసుకోకూడదని భారత్ కు తెలుసు. దీంతో బీసీసీఐ ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా రెండు టెస్టుల సిరీస్ కోసం పూర్తి బలంతో కూడిన జట్టును ప్రకటించింది. విశ్రాంతి ఇస్తారనుకున్న బుమ్రా కూడా జట్టులోకి వచ్చాడు. అలాగే, టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ కూడా జట్టులోకి వచ్చాడు.