ఐపీఎల్ 2025: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఎంఎస్ ధోనీ వచ్చేస్తున్నాడు

First Published Sep 11, 2024, 9:38 AM IST

IPL 2025 : చెన్నై సూప‌ర్ కింగ్స్ 'తలా' గా పేరొందిన భార‌త క్రికెట్ దిగ్గ‌జం ఎంఎస్ ధోనీ ఐపీఎల్ సీజన్లలో 10 సార్లు ఫైన‌ల్స్ త‌న టీమ్ ను తీసుకెళ్లాడు. అలాగే,  2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో మొత్తంగా ఐదు టైటిళ్లను అందించాడు.
 

IPL 2025 : ఎంఎస్ ధోని.. భార‌త క్రికెట్ లో ఒక సంచ‌ల‌నం. అంత‌ర్జాతీయ క్రికెట్ లో అద్భుత‌మైన కెప్టెన్ల‌లో ఒక‌రు. త‌న‌దైన కూల్ నెస్, గెలుపు వ్యూహాలతో భార‌త్ కు అనేక విజ‌యాలు అందించారు. టీమిండియాను మూడు ఫార్మాట్ల‌ల‌లో నెంబ‌ర్ వ‌న్ గా నిలబెట్టారు. 

అంత‌ర్జాతీయ క్రికెట్ లో ధోని అనేక రికార్డులు సాధించాడు. త‌న టెస్టు కెరీర్ లో 90 మ్యాచ్ ల‌లో 4876 ప‌రుగులు చేశాడు. వ‌న్డేల‌లో 350 మ్యాచ్ ల‌లో  10773 ప‌రుగులు చేయ‌గా, ఇందులో 10 సెంచ‌రీలు, 73 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇక టీ20 ఫార్మాట్ లో 98 మ్యాచ్ ల‌ను ఆడి 1617 ప‌రుగులు చేశాడు. ఇక ఐపీఎల్ లో 264 మ్యాచ్ ల‌ను ఆడిన ధోని 5243 ప‌రుగులు చేశాడు. 

అయితే, గ‌త ఐపీఎల్ సీజ‌న్ లో (ఐపీఎల్ 2024) లో ధోని చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్సీకి వీడ్కోలు ప‌లికాడు. త‌న కెప్టెన్సీని వ‌దులుకోవ‌డంతో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అయ్యాడు. కానీ, జ‌ట్టును విజ‌య‌వంతంగా ముందుకు న‌డిపిన ధోని ఫీల్డ్ లో ప్లేయ‌ర్ల‌కు సూచ‌న‌లు చేస్తూ రుతురాజ్ కు తోడుగా క‌నిపించాడు. 

ధోని ఐపీఎల్ 2024 సీజ‌న్ చివ‌రిద‌ని క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగింది. గ్రౌండ్ లో మ‌ళ్లీ ధోని బ్యాటింగ్ ను చూసే అవ‌కాశం లేద‌ని ప‌లు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. ప్లేయ‌ర్ గా కాకుండా కోచింగ్ సిబ్బంది పాత్ర‌లో ధోని క‌నిపిస్తార‌ని భావిస్తున్నారు. ఇలాంటి క్ర‌మంలోనే 'త‌లా' ఫ్యాన్స్ కు మ‌రో గుడ్ న్యూస్ వచ్చింది. 

Latest Videos


రాబోయే ఐపీఎల్ సీజ‌న్ లో ధోని ఆట‌ను చూడ‌వ‌చ్చు. మ‌రోసారి చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున ధోని బ్యాట‌ర్ గా బ‌రిలోకి దిగుతార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అలాగే, ధోని స‌న్నిహితుడు, స్టార్ మాజీ క్రికెట‌ర్ సురేష్ రైనా చేసిన కామెంట్స్ కూడా వైర‌ల్ గా మారాయి. ధోని ఆడ‌తాడ‌నీ, తాను కూడా అదే కోరుకుంటున్నాన‌ని చెప్పాడు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పలు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడిన సురేష్ రైనా.. ఎంఎస్ ధోని ఐపీఎల్ 2025లో పోటీ పడాలని కోరుకుంటున్నారు. గాయాల కారణంగా ధోని లీగ్‌ నుంచి తప్పుకుంటాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనుభవజ్ఞుడు తన భవిష్యత్తుపై కాల్ తీసుకునే ముందు కొత్త నిలుపుదల నిబంధనల కోసం వేచి ఉంటార‌ని చెప్పాడు.

మహీ గత రెండు సీజన్లుగా గాయాలతో పోరాడుతున్నాడు. ఇదిలా ఉండగా, ఐపీఎల్ 17వ సీజన్‌లో ధోని బ్యాట్‌తో ఆకట్టుకున్నాడని రైనా పేర్కొన్నాడు. ధోనీ ఉనికి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా సహాయపడుతుందని చెప్పాడు. 

"మునుపటి సీజన్‌లో అతని ఆకట్టుకునే ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని, ఎంఎస్ ధోని ఐపీఎల్ 2025లో ఆడాలని నేను కోరుకుంటున్నాను. రుతురాజ్ గైక్వాడ్‌కు మరో సీజన్‌కు మార్గదర్శకత్వం అవసరమని నేను భావిస్తున్నాను, ఎందుకంటే అతని కెప్టెన్సీ అనేక గేమ్‌లలో సరైన స్థాయిలో లేదని" రైనా పేర్కొన్నాడు. 

అలాగే, "ఆర్‌సీబీపై ఓడిపోవడంతో అతను నాయకుడిగా కష్టపడుతున్నాడు. అయినప్పటికీ, అతను పరిపక్వతను చూపించాడు. మంచి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం క‌నిపించింది. కెప్టెన్ గా బాగా ప‌నిచేయ‌డంతో పాటు మంచి బ్యాటింగ్ తో రాణించాడు" అని సురేశ్ రైనా స్పోర్ట్స్ టాక్‌తో అన్నారు.

ఐపీఎల్ 2025 కి ముందు మెగా వేలం జ‌ర‌గ‌నుంది. దీని కోసం ఇప్ప‌టికే బీసీసీఐ సిద్ధ‌మ‌వుతోంది. కొత్త నిర్ణ‌యాలు, మార్పులు, రూల్స్ విష‌యంలో ఇప్ప‌టికే ప‌లుమార్లు ఐపీఎల్ ఫ్రాంఛైజీల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. ఇక్క‌డ తీసుకునే నిర్ణ‌యాలు ధోని విష‌యంలో కీల‌కంగా మార‌నున్నాయి. కాగా, గ‌త సీజ‌న్ లో (ఐపీఎల్ 2024) లో ధోనికి బ్యాటింగ్ చేసే అవ‌కాశాలు పెద్ద‌గా రాలేదు. ప్లేయ‌ర్ గా 73 బంతుల్లో 161 పరుగులతో  చేశాడు.

click me!