Published : Sep 10, 2024, 04:26 PM ISTUpdated : Sep 10, 2024, 04:37 PM IST
Sachin Tendulkar: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వన్డే సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీల సచిన్ టెండూల్కర్ రికార్డును రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేదు. అయితే, ఇప్పుడు భారత్ తో జరిగే టెస్టు సిరీస్ లో సచిన్ సాధించిన ఒక రికార్డును బంగ్లాదేశ్ ప్లేయర్ ముష్ఫికర్ రహీమ్ బద్దలు కొట్టాలని చూస్తున్నాడు.
క్రికెట్ లెజెండ్, గాడ్ ఆఫ్ క్రికెట్ గా గుర్తింపు సాధించిన టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అనేక రికార్డులు సృష్టించారు. తన క్రికెట్ కెరీర్ లో సచిన్ ఏకంగా 100 సెంచరీలు బాదాడు. టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు కొట్టాడు.
వన్డే క్రికెట్‌లో 50 సెంచరీల క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును రన్ మెషీన్ విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. అయితే ఇప్పటివరకు దిగ్గజ క్రికెటర్ సచిన్ అత్యధిక పరుగుల రికార్డును ఏ ఆటగాడు బద్దలు కొట్టలేదు. సచిన్ 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 34,357 పరుగులు చేశాడు.
26
India vs Bangladesh, Sachin Tendulkar
విరాట్ కోహ్లీ మాత్రమే కాదు మరే ఆటగాడు ఈ రికార్డును బద్దలు కొట్టలేదు. కోహ్లీ 533 మ్యాచ్ లలో 26,942 పరుగులతో ప్రపంచంలోనే అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. సెప్టెంబర్ 19 (2024) నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న 2 టెస్టుల సిరీస్‌లో సచిన్ సాధించిన ఒక రికార్డును విరాట్ కోహ్లీతో పాటు ఒక బంగ్లాదేశ్ ప్లేయర్ బద్దలు కొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.అదే భారత్-బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ రికార్డు.
36
Virat Kohli, IND vs BAN Test Cricket
ఫిబ్రవరి 19 నుంచి చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. రెండో టెస్టు అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు కాన్పూర్ లో జరగనుంది. టెస్టు మ్యాచ్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది.
ఈ సిరీస్ లో సచిన్ టెండూల్కర్ అతిపెద్ద రికార్డు బద్దలు అయ్యే ఛాన్స్ ఉంది. ఇరు జట్ల మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. టెండూల్కర్ మొత్తం 7 మ్యాచ్ లలో 9 ఇన్నింగ్స్ లలో 136.66 సగటుతో 820 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు కూడా ఉన్నాయి.
46
India vs Bangladesh Test, Sachin Tendulkar
సచిన్ టెండూల్కర్ 820 పరుగుల రికార్డును బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ బద్దలు కొట్టనున్నాడు. భారత్ లో జరిగిన 8 టెస్టుల్లో ముష్ఫికర్ రహీమ్ 15 ఇన్నింగ్స్ లలో ఇప్పటివరకు 604 పరుగులు చేశాడు.
ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. భారత్ లో జరిగే రెండు టెస్టుల సిరీస్ లో ముష్ఫికర్ రహీమ్ మరో 217 పరుగులు చేస్తే సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు అవుతుంది. ఈ లిస్టులో రాహుల్ ద్రావిడ్ మూడో స్థానంలో ఉన్నాడు. ద్రవిడ్ 5 మ్యాచ్ లలో 3 సెంచరీలతో 560 పరుగులు చేశాడు.
56
KL Rahul, IND vs BAN Test
ఆ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా ఉన్నారు. పుజారా 5 మ్యాచ్ లలో 468 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 6 మ్యాచ్ లలో 437 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ లో టెస్టు సిరీస్ కోసం విరాట్ కోహ్లీకి జట్టులో చోటు దక్కింది. 2024లో కోహ్లీ ఇప్పటి వరకు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడాడు.
రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కూడా టెస్టు మ్యాచ్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇంగ్లాండ్ తో కేెఎల్ రాహుల్ ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడాడు. కానీ రిషబ్ పంత్ 2022 తర్వాత తొలిసారి టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు. పంత్ చివరిసారిగా బంగ్లాదేశ్ తో టెస్టు మ్యాచ్ ఆడాడు. అతని కారు ప్రమాదం తర్వాత మళ్లీ అదే జట్టుతో తిరిగి టెస్టు క్రికెట్ లోకి వస్తున్నాడు.
66
India vs Bangladesh, Rishabh Pant
కాాగా, భారత్-బంగ్లాదేశ్ జట్లు ఇప్పటి వరకు 13 టెస్టు మ్యాచ్ లలో తలపడ్డాయి. ఇందులో భారత్ 11 మ్యాచ్ లలో విజయం సాధించింది. రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలనే ఉత్సాహంతో బంగ్లాదేశ్ భారత్ లో అడుగుపెట్టబోతోంది.
ఇప్పటికే బంగ్లాదేశ్ మంచి జోష్ లో ఉంది. ఎందుకంటే స్వదేశంలో బలమైన జట్టుగా ఉంటే పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవలే ముగిసిన రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో పాకిస్తాన్ ను వారి సొంత గడ్డపై బంగ్లాదేశ్ 2-0తో ఓడించి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు భారత్ పై కూడా మంచి ప్రదర్శన ఇవ్వాలని చూస్తోంది.