తూచ్! అది నిజం కాదు... విరాట్ కోహ్లీకి కరోనా సోకింది నిజమే కానీ..

Published : Jun 22, 2022, 04:12 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత దాదాపు నెల రోజుల క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్న భారత స్టార్ ప్లేయర్లు అందరూ ప్రస్తుతం ఇంగ్లాండ్‌ టూర్‌లో ఉన్నారు. భారత మాజీ సారథి విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుత సారథి రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ అండ్ కో.. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్టులో పాల్గొనబోతున్నారు..

PREV
17
తూచ్! అది నిజం కాదు... విరాట్ కోహ్లీకి కరోనా సోకింది నిజమే కానీ..

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ నుంచి రెస్ట్ లభించడంతో మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేశాడు విరాట్ కోహ్లీ. బీచ్‌లో ఒంటరిగా కూర్చొని, సముద్రాన్ని తీక్షణంగా చూస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విరాట్...

27

మాల్దీవుల నుంచి స్వదేశానికి చేరుకున్న తర్వాత ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్యాంపులో చేరిన విరాట్ కోహ్లీ, టీమిండియా ప్లేయర్లు ఛతేశ్వర్ పూజారా, రవీంద్ర జడేజా, శుబ్‌మన్ గిల్, కెఎస్ భరత్, హనుమ విహారి, మహ్మద్ సిరాజ్ తదితరులతో కలిసి ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కాడు...

37

అయితే ఇంగ్లాండ్ చేరిన తర్వాత విరాట్ కోహ్లీ కరోనా బారిన పడ్డాడని, అతనితో కలిసి ప్రయాణించిన మరికొందరు ప్లేయర్లలో కరోనా లక్షణాలు ఉన్నాయనే వార్త సోషల్ మీడియాలో ధావాళంగా వ్యాపించింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తేలింది...

47

విరాట్ కోహ్లీ కరోనా బారిన పడిన మాట నిజమే కానీ, మాల్దీవుల నుంచి వచ్చిన తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్‌కి పాజిటివ్ వచ్చిందని... అయితే పూర్తిగా కోలుకున్న తర్వాతే బీసీసీఐ క్యాంపులో చేరాడని తేలింది...

57

ఫిట్‌నెస్ ఎంతో శ్రద్ధ తీసుకునే విరాట్ కోహ్లీ, సాటి ప్లేయర్ల ఆరోగ్యం విషయంలో కూడా ఎంతో కేర్ తీసుకుంటాడని... కరోనా లక్షణాలు ఉంటే టీమ్‌తో కలిసి ప్రయాణం చేసేవాడు కూడా కాదని అంటున్నారు ఆయన సన్నిహితులు...
 

67

స్వదేశంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ మినహా, ఇంగ్లాండ్ చేరిన వారిలో ఏ ప్లేయర్‌కి కూడా కరోనా సోకలేదని తేలింది. అశ్విన్ కూడా మరికొన్ని రోజుల్లో కరోనా నుంచి కోలుకుని, ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కబోతున్నట్టు సమాచారం... 

77
Image credit: BCCI

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న విరాట్ కోహ్లీ, లంకాషైర్‌తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా పాల్గొనబోతున్నాడని... అతనితో పాటు భారత టాప్ ప్లేయర్లు ఈ మ్యాచ్‌కి అందుబాటులో ఉంటారని తెలియవచ్చింది.. 

Read more Photos on
click me!

Recommended Stories