ప్రాక్టీస్ చేస్తలేడు, ట్రైనింగ్ అస్సల్లేదు... బ్రేక్ టైమ్‌లో బేర్ గ్రిల్స్‌తో షో చేస్తున్న కోహ్లీ!...

Published : Aug 01, 2022, 07:00 PM ISTUpdated : Aug 01, 2022, 07:05 PM IST

క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫామ్ గురించే చర్చ జరుగుతోంది. క్రికెట్ ఆడుతున్నవాళ్లు, క్రికెట్ మానేసి ఇంట్లో కూర్చొని యూట్యూబ్ వీడియోలు చేస్తున్నవాళ్లు కూడా విరాట్ కోహ్లీ ఫామ్ గురించే మాట్లాడుతున్నారు. ఆయన ఫ్యాన్స్ అయితే విరాట్ కోహ్లీ ఎప్పుడు ఫామ్‌లోకి తిరిగొస్తాడా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు...  

PREV
17
ప్రాక్టీస్ చేస్తలేడు, ట్రైనింగ్ అస్సల్లేదు... బ్రేక్ టైమ్‌లో బేర్ గ్రిల్స్‌తో షో చేస్తున్న కోహ్లీ!...
Virat Kohli

రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు దూరంగా ఉన్నాడు. వన్డేతో పాటు టీ20 సిరీస్ నుంచి కూడా రెస్ట్ కావాలని విరాట్ కోహ్లీ, బీసీసీఐని కోరినట్టు సమాచారం...

27

ఈ బ్రేక్ టైమ్‌లో విరాట్ కోహ్లీ తిరిగి తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అకాడమీకి వెళ్లబోతున్నాడని, బేసిక్స్ నుంచి మొదలెట్టి తిరిగి మునుపటి ఫామ్‌లోకి రావడానికి మార్గాలు వెతకబోతున్నాడని వార్తలు వచ్చాయి...

37
Virat Kohli

అయితే ఇంగ్లాండ్ టూర్ ముగించుకున్న భారత జట్టు, వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్ ముగించి.. టీ20 సిరీస్ మొదలెట్టినా... విరాట్ కోహ్లీ, తన సతీమణి అనుష్క శర్మతో కలిసి ఇంకా లండన్ వీధుల్లోనే తిరుగుతున్నాడు...

47

అయితే తాజాగా విరాట్ కోహ్లీ ఈ గ్యాప్‌లో డిస్కవరీ ఛానెల్‌లో వింత వింత అడ్వెంచర్లు చేసే బేర్ గిల్స్‌ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షోలో పాల్గొనబోతున్నాడని వార్తలు వస్తున్నాయి... అడవుల్లో కొండల్లో తిరుగుతూ దొరికిన పాములు, ఎలుకలను కాల్చుకుని తినే బేర్ గిల్స్ షోకి ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది.

57

ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బాలీవుడ్ నటులు అక్షర్ కుమార్, అజయ్ దేవగణ్, విక్కీ కౌశల్, రణ్‌వీర్ సింగ్‌లతో కలిసి స్పెషల్ ఎపిసోడ్స్ చేశాడు బేర్ గిల్స్... అలాగే సౌత్ సూపర్ ప్టార్ రజినీ కాంత్ కూడా బేర్ గిల్స్ షోలో పాల్గొన్నాడు...

67

తాజాగా బేర్ గిల్స్.. ‘విరాట్ కోహ్లీతో సాహసం చేసే అద్భుతంగా ఉంటుంది. అతని మనసు సింహం లాంటిది...’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో త్వరలో విరాట్ కోహ్లీ, బేర్ గిల్స్ షోలో ప్రత్యేక్షం కాబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి...

77

విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇన్‌స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్‌లో కలిపి దాదాపు 250 మిలియన్ల ఫాలోవర్లు, విరాట్‌ని ఫాలో అవుతున్నారు. విరాట్ కోహ్లీ, బేర్ గిల్స్ షోకి వస్తే ఆ ఎపిసోడ్‌కి రికార్డు టీఆర్పీ రావడం ఖాయమంటున్నారు ఎక్స్‌పర్ట్స్... 

Read more Photos on
click me!

Recommended Stories