90 లలో పాకిస్తాన్ చేసిన తప్పే ఇప్పుడు భారత్ చేస్తోంది.. : రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు

Published : Aug 01, 2022, 03:15 PM IST

Team India Captain: పాకిస్తాన్ మాజీ సారథి రషీద్ లతీఫ్ భారత జట్టు అనుసరిస్తున్న తాజా విధానంపై విమర్శలు గుప్పించాడు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్ లో తిప్పలు తప్పవని హెచ్చరించాడు. 

PREV
16
90 లలో పాకిస్తాన్ చేసిన తప్పే ఇప్పుడు భారత్ చేస్తోంది.. : రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు

గత కొన్నాళ్లుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుసరిస్తున్న విధానంపై  పాకిస్తాన్ మాజీ సారథి రషీద్ లతీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.  భారత జట్టు పదే పదే సారథులను మార్చడం మంచి పద్దతి కాదని అతడు హెచ్చరించాడు. 

26

గతేడాది నవంబర్ లో పొట్టి ప్రపంచకప్ ముగిశాక టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. ఆ తర్వాత  భారత జట్టుకు రెగ్యులర్ సారథిగా రోహిత్ శర్మను నియమించినా.. వాస్తవానికి సిరీస్ కు ఒక సారథి మారుతున్నాడు. 

36

గడిచిన సుమారు 9 నెలల కాలంలో భారత్ కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషభ్ పంత్,జస్ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా లు సారథిగా వ్యవహరించారు. ఇక తాజాగా వెస్టిండీస్ తో వన్డే సిరీస్ తో పాటు త్వరలో జరుగబోయే జింబాబ్వే సిరీస్ కు శిఖర్ ధావన్ సారథి. 

46
Shikhar Dhawan

ఈ నేపథ్యంలో రషీద్ లతీఫ్ స్పందించాడు. బీసీసీఐ తీరు చూస్తుంటే అది గతంలో పాకిస్తాన్ జట్టు చేసిన తప్పులనే ఇప్పుడు టీమిండియా చేస్తుందని   అన్నాడు. టీమిండియాకు ఇంకెంతమంది  కెప్టెన్లను మారుస్తారని ఆయన ప్రశ్నించాడు. 

56

రషీద్ తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘ఆటగాళ్లు, బ్యాకప్ కెప్టెన్ల గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పటికే టీమిండియా.. కోహ్లీ తప్పుకున్నా  రోహిత్, కెఎల్ రాహుల్, రిషభ్ పంత్, బుమ్రా, శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా లను సిరీస్ కు ఒకరు అన్నవిధంగా మారుస్తున్నది.  

66

ప్రస్తుతం భారత జట్టు తీరు చూస్తుంటే టీమిండియా సైతం 1990లలో పాకిస్తాన్ చేసిన తప్పే చేస్తున్నట్టుంది..’ అని లతీఫ్ వాపోయాడు. 90లలో పాకిస్తాన్ కూడా  సారథులను పదే పదే మార్చింది.  1992లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పాకిస్తాన్ వన్డే ప్రపంచకప్ నెగ్గాక ఆ జట్టుకు జావేద్ మియాందాద్, వసీం అక్రమ్, సలీమ్ మాలిక్, వకార్ యూనిస్,  రమీజ్ రాజా, రషీద్ లతీఫ్, సయూద్ అన్వర్, అమీర్ సొహైల్ లు సారథులుగా పనిచేశారు.

click me!

Recommended Stories