అర్ష్‌దీప్‌కు అది బాగా తెలుసు.. అందుకే అతడు సక్సెస్ అవుతున్నాడు.. పంజాబ్ పేసర్ పై భువీ ప్రశంసలు

Published : Aug 01, 2022, 04:23 PM IST

WI vs IND T20I: మే లో ముగిసిన ఐపీఎల్ లో అర్ష్‌దీప్ నిలకడగా రాణించి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో అతడు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ తో టీ20ల ద్వారా ఎంట్రీ ఇచ్చిన అర్ష్‌దీప్.. విండీస్ తో సిరీస్ లోనూ ఎంపికయ్యాడు. 

PREV
16
అర్ష్‌దీప్‌కు అది బాగా తెలుసు.. అందుకే అతడు సక్సెస్ అవుతున్నాడు.. పంజాబ్ పేసర్ పై భువీ ప్రశంసలు

ఐపీఎల్ లో నిలకడగా రాణించి తద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన అర్ష్‌దీప్ ఆనతికాలంలోనే గుర్తింపు సంపాదించుకున్నాడు.  నమ్మదగ్గ బౌలర్ గా  ఎదుగుతున్న ఈ యువ పేసర్ పై టీమిండియా  సీనియర్ బౌలర్ భువనేశ్వర్ ప్రశంసలు కురిపించాడు.  

26

విండీస్ తో టీ20 సిరీస్ లో అర్ష్‌దీప్‌తో కలిసి బౌలింగ్ విభాగం బాధ్యతలు మోస్తున్న భువీ  రెండో టీ20కి  ముందు మాట్లాడుతూ.. ‘అర్ష్‌దీప్ లో గొప్ప విషయం ఏంటంటే మ్యాచ్ కు ఏం కావాలో అతడికి తెలుసు. ఒక బౌలర్ కు ఎలా బౌలింగ్ చేయాలి..? ఎలా ఫీల్డింగ్ సెట్ చేసుకోవాలి..? వంటివి అర్ష్‌దీప్ త్వరగానే నేర్చుకున్నాడు.

36

సాధారణంగా అయితే క్రికెట్ ఆడుతున్న క్రమంలో ఇవన్నీ అలవాటవుతాయి. కానీ అర్ష్‌దీప్ మాత్రం జాతీయ జట్టుకు అరంగేట్రం చేయడానికంటే ముందే  వాటిపై పరిణితి సాధించాడు. చాలా తక్కువమంది యువ ఆటగాళ్లు ఇలాంటి పరిణితితో వస్తారు. అందులో అర్ష్‌దీప్ ముందువరుసలో ఉంటాడు. 

46
Image credit: Getty

ఐపీఎల్ లో అతడు గత రెండు మూడు సీజన్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. అతడికి మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు ఎలా ఆడాలో బాగా తెలుసు. అదీగాక అర్ష్‌దీప్ ఎప్పుడూ ఆట గురించే చర్చిస్తూ ఉంటాడు. అది అతడిలో ఉన్న మరో మంచి లక్షణం..’ అని కొనియాడాడు. 
 

56

మే లో ముగిసిన ఐపీఎల్ లో అర్ష్‌దీప్.. 14 మ్యాచులలో 10 వికెట్లు తీశాడు. అయితే వికెట్లు తీయకున్నా డెత్ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా బ్యాటర్లను అడ్డుకున్నాడు. కట్టుదిట్టమైన బంతులతో కచ్చితమైన లైనింగ్ తో బంతులు విసిరాడు.  అర్ష్‌దీప్ లోని ప్రతిభను గుర్తించిన సెలక్టర్లు అతడిని స్వదేశంలో సౌతాఫ్రికా సిరీస్ కు ఎంపిక చేశారు. 
 

66

అయితే ఆ సిరీస్ లో అతడికి ఆడే అవకాశం రాలేదు. తర్వాత ఇంగ్లాండ్ తో టీ20లలో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు.  తన తొలి మ్యాచ్ లో 3 ఓవర్లు వేసి 18 పరుగులే ఇచ్చి  రెండు వికెట్లు తీశాడు. తర్వాత కూడా తనకు అవకాశమిచ్చిన ప్రతి మ్యాచ్ లో బ్యాటర్లకు పగ్గాలు వేస్తున్నాడు. 

click me!

Recommended Stories