విరాట్ అందరికీ సమాధానం చెబుతాడు... ఈసారి డబుల్ కాదు, త్రిబుల్ సెంచరీతోనే వస్తాడు...

Published : Sep 16, 2021, 12:05 PM IST

ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్‌ను తెగ ఇబ్బంది పెడుతున్న విషయం ఒక్కటే... కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్. 2019 వరకూ ఎక్కడా ఆగకుండా, రన్ మెషిన్‌లా పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు సెంచరీ మార్కు అందుకోవడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు...

PREV
19
విరాట్ అందరికీ సమాధానం చెబుతాడు... ఈసారి డబుల్ కాదు, త్రిబుల్ సెంచరీతోనే వస్తాడు...

గత దశాబ్దంలో 20 వేల పరుగులు సాధించి, అసాధ్యమైన రికార్డును కొల్లగొట్టి... ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డికేట్’గా నిలిచాడు విరాట్ కోహ్లీ...

29

ఈసారి ఫామ్ అందుకుంటే... మునుపటి కంటే వేగంగా మూడు ఫార్మాట్లలోనూ పరుగులు చేస్తాడని అంటున్నాడు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్...

39

‘విరాట్ కోహ్లీపై కెప్టెన్సీ ప్రెజర్ ఏ మాత్రం లేదు. ఎందుకంటే అతనికి కెప్టెన్సీ కొత్తేమీ కాదు. కెప్టెన్‌గా రాణిస్తూనే, బ్యాటుతో రికార్డు స్థాయిలో పరుగులు చేశాడు...

49

ఇప్పుడు విరాట్ కోహ్లీపై కెప్టెన్సీ భారం ఉందని మాట్లాడుతున్నవాళ్లు, కెప్టెన్‌గా విరాట్ చేసిన పరుగుల గురించి మరిచిపోయారు. ప్రతీ క్రికెటర్ కెరీర్‌లో ఇలాంటి స్థితి సర్వసాధారణం...

59

కోహ్లీ ఇప్పుడు అలాంటి స్టేజ్‌లోనే ఉన్నాడు. అతనిలో చాలా పరిణితి వచ్చింది. ఇంతకుముందులా ఆవేశపడడం లేదు. చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నాడు...

69

ఇప్పుడు అతను ఫామ్‌లోకి వస్తే... ఇంతకుముందులా సెంచరీలు, డబుల్ సెంచరీలతో ఆగడు. త్రిబుల్ సెంచరీలు కూడా ఈజీగా బాదగలడు... త్వరలోనే మనం విరాట్ కోహ్లీ ఫామ్‌ను చూస్తాం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్...

79

రెండేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, టీ20 వరల్డ్‌కప్ తర్వాత వన్డే, టీ20ల్లో కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి...

89

టీ20, వన్డే కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించి, టెస్టుల్లో మాత్రమే కెప్టెన్‌గా కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ మాత్రం ఆ వార్తలను కేవలం పుకార్లంటూ కొట్టిపారేసింది...

99
Virat Kohli

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా ఫలితం ఎలా ఉన్నా, మూడు ఫార్మాట్లలోనూ విరాట్ కోహ్లీయే కెప్టెన్‌గా కొనసాగుతాడంటూ తేల్చి చెప్పేశాడు బీసీసీఐ ట్రెజరర్...

click me!

Recommended Stories