ఈసారి కూడా ముంబైదే టైటిల్, ఆర్‌సీబీకి కష్టమే... గంభీర్ కామెంట్స్...

First Published Sep 14, 2021, 4:47 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2కి ముహుర్తం దగ్గరపడే కొద్దీ, అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రసవత్తరంగా మ్యాచులు జరుగుతున్న సమయంలో కరోనా కారణంగా బ్రేక్ పడిన ఐపీఎల్ 2021, సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే...

గత సీజన్లో టైటిల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, ఈసారి కూడా ఆ అడ్వాంటేజ్ బాగా కలిసి వస్తుందని అంటున్నాడు కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్...

‘యూఏఈలో జరిగిన గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. ఈసారి కూడా మిగిలిన మ్యాచులు అక్కడే జరగబోతుండడం వారికి అదనపు బలంగా మారతాయి. 

ఎందుకంటే యూఏఈ పిచ్‌లు, ముంబై హిట్టర్లకు సరిగ్గా సూట్ అవుతాయి. అందుకే గత సీజన్‌లో వారి ప్రదర్శన మిగిలిన టీమ్‌ల కంటే మెరుగ్గా ఉంది...

ఇండియాలో చెన్నైలో జరిగిన మ్యాచుల్లో తెగ ఇబ్బంది పడిన ముంబై బ్యాట్స్‌మెన్, ఫేజ్ 2 యూఏఈకి మారడంతో సంతోషించి ఉంటారు... ఈసారి టైటిల్ గెలవాలని ఆశపడిన ఆర్‌సీబీకి కష్టకాలం తప్పదు. 

ఎందుకంటే భారత్‌లో జరిగిన ఫేజ్ 1లో చక్కగా రాణించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, గత సీజన్‌లో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు... అతన్ని ఆ విషయం బాగా ఇబ్బంది పెడుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు గౌతీ...

గౌతమ్ గంభీర్ కామెంట్లపై ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతుంటే, ఆర్‌సీబీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే గౌతమ్ గంభీర్ ఏది అంచనా వేసినా, రిజల్ట్ దానికి రివర్స్‌లో జరుగుతుందని క్రికెట్ వరల్డ్‌లో ఓ సెంటిమెంట్ ఫిక్స్ అయిపోయింది...

click me!