ఇలాగైతే యాషెస్ సిరీస్ ఆడం... ఆస్ట్రేలియాలో ఆ రూల్స్ మార్చాలంటున్న ఇంగ్లాండ్ ప్లేయర్లు...

First Published Sep 16, 2021, 10:05 AM IST

ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న టెస్టు క్రికెట్ సిరీస్‌లలో యాషెస్ సిరీస్ ఒకటి. యాషెస్ సిరీస్ కోసమే ఏడాదిన్నరగా తమ క్రికెటర్ల విషయంలో రొటేషన్ పాలసీని అమలు చేస్తూ వస్తోంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. అయితే తీరా సిరీస్ దగ్గర పడ్డాకే, కొందరు ఇంగ్లాండ్ క్రికెటర్లు యాషెస్ సిరీస్ నుంచి తప్పుకుంటామని చెప్పడం, క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది...

ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న టెస్టు క్రికెట్ సిరీస్‌లలో యాషెస్ సిరీస్ ఒకటి. యాషెస్ సిరీస్ కోసమే ఏడాదిన్నరగా తమ క్రికెటర్ల విషయంలో రొటేషన్ పాలసీని అమలు చేస్తూ వస్తోంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. అయితే తీరా సిరీస్ దగ్గర పడ్డాకే, కొందరు ఇంగ్లాండ్ క్రికెటర్లు యాషెస్ సిరీస్ నుంచి తప్పుకుంటామని చెప్పడం, క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది...

బయో బబుల్, క్వారంటైన్ ప్రోటోకాల్‌ను కఠినంగా అమలు చేస్తున్న దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. ఐపీఎల్ 2020 తర్వాత ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లిన భారత జట్టు, అక్కడ కఠినమైన క్వారంటైన్ నిబంధనల కారణంగా అనేక కష్టాలు పడింది...

కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఇప్పుడు కూడా ఆస్ట్రేలియాలో ఇలాంటి కఠిన క్వారంటైన్‌నే అమలు చేస్తోంది ఆస్ట్రేలియా. ఆసీస్ పర్యటనలో ఇంగ్లాండ్ క్రికెటర్లు తప్పనిసరిగా రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది...

అయితే ఆసీస్ పర్యటనలో కుటుంబాలను అనుమతించడం లేదు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. యాషెస్ సిరీస్ కంటే ముందు ఐపీఎల్ 2021, టీ20 వరల్డ్‌కప్ టోర్నీల కోసం దాదాపు రెండు, మూడు నెలల పాటు కుటుంబాలకు దూరంగా ఉండబోతున్నారు ఇంగ్లాండ్ క్రికెటర్లు...

దీంతో కరోనా ప్రోటోకాల్స్‌ నిబంధనల్లో స్వల్పంగా మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇంగ్లాండ్ క్రికెటర్లు... ఒంటరి గదుల్లో కఠినమైన క్వారంటైన్ కాకుండా, మిగిలిన ప్లేయర్లతో కలిసి మాట్లాడుకునే సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు...

ఇప్పటికే క్వారంటైన్, బయో బబుల్ జీవితంతో విసిగి, వేసారిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, క్రికెట్ నుంచి అర్ధాంతరంగా బ్రేక్ తీసుకున్నాడు. 

ఆసీస్ టూర్‌లో 14 రోజుల పాటు ఒంటరిగా క్వారంటైన్ గడిపితే, మరికొందరు క్రికెటర్లు కూడా ఇదే విధంగా మానసికంగా ఇబ్బంది పడొచ్చని అంటున్నారు ఇంగ్లాండ్ క్రికెట్ విశ్లేషకులు...

క్వారంటైన్ రూల్స్ మార్చి, నిబంధనలకు సరళీకృతం చేయకపోతే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2021-22ని బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు... 

2019లో జరిగిన యాషెస్ సిరీస్‌ 2-2 తేడాతో డ్రాగా ముగిసింది. దీంతో అంతకుముందు టెస్టు సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టుకే టైటిల్ వరించింది...

ఈ ఏడాది చివరన జరిగే యాషెస్ సిరీస్, ఇంగ్లాండ్ జట్టులోని సీనియర్ పేసర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ వంటి ప్లేయర్లకు ఆఖరి సిరీస్ అవుతుందని అంచనా... 

click me!