విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు... ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో...

First Published Aug 2, 2021, 2:59 PM IST

కొన్నాళ్లుగా సరైన ఫామ్‌లో లేకపోయినా రికార్డులు క్రియేట్ చేయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు భారత సారథి విరాట్ కోహ్లీ. రెండేళ్ల క్రితం వరకూ సెంచరీల మోత మోగించిన విరాట్ కోహ్లీ కోసం ఇంగ్లాండ్ సిరీస్‌లో మరిన్ని రికార్డులు ఎదురుచూస్తున్నాయి...

Virat Kohli

ప్రస్తుతం వన్డేల్లో 12,169, టెస్టుల్లో 7,490 పరుగులు, టీ20ల్లో 3,159 పరుగులతో ఉన్న విరాట్ కోహ్లీ 23 వేల అంతర్జాతీయ పరుగులు సాధించడానికి మరో 125 పరుగుల దూరంలో ఉన్నాడు.

Virat Kohli

అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించబోతున్నాడు విరాట్ కోహ్లీ... 

సచిన్ టెండూల్కర్‌కి 23 వేల అంతర్జాతీయ పరుగుల మైలురాయిని అందుకోవడానికి 472 ఇన్నింగ్స్‌లు అవసరమైతే, ప్రస్తుతం 435 ఇన్నింగ్స్‌ల్లో 22,875 పరుగులతో ఉన్నాడు విరాట్ కోహ్లీ...

అలాగే కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా నిలవడానికి కూడా విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేస్తే చాలు. ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్‌లో 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, కెప్టెన్‌గా 41వ సెంచరీలు సాధించాడు.

ఆస్ట్రేలియా మాజీ లెజెండరీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా కెప్టెన్‌గా 41 సెంచరీలు సాధించి, టాప్‌లో ఉన్నాడు. విరాట్ మరో సెంచరీ సాధిస్తే, పాంటింగ్‌ను అధిగమించి టాప్‌లో నిలుస్తాడు...

ఐదు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు ఒక్క విజయం సాధించినా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో అత్యధిక విజయాలు సాధించిన ఆసియా కెప్టెన్‌గా నిలుస్తాడు విరాట్ కోహ్లీ.

ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ ఈ నాలుగు దేశాల్లో నాలుగు విజయాలు సాధించి పాక్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్, వసీం అక్రమ్‌ల రికార్డులతో సమంగా నిలిచాడు...

ఇంగ్లాండ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన రెండో భారత కెప్టెన్‌గా కపిల్ దేవ్‌ తర్వాతి స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ, మరో అవార్డు గెలిస్తే... ఆయన్ని కూడా అధిగమిస్తాడు.

click me!