బెన్‌ స్టోక్స్ స్థానంలో భారత క్రికెటర్ ఉండి ఉంటే... సన్‌రైజర్స్ ప్లేయర్ షాకింగ్ కామెంట్...

First Published Aug 2, 2021, 12:59 PM IST

కరోనా ఎంట్రీ తర్వాత బయో బబుల్, క్వారంటైన్, ప్రోటోకాల్ జీవితాన్ని భరించలేక... మెంటల్ హెల్త్ కోసం క్రికెట్ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్...

భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కి దూరమైన బెన్ స్టోక్స్, ఆ తర్వాత జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొంటాడా? లేదా? అనే విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు...

బెన్ స్టోక్స్, బయో బబుల్ జీవితం నుంచి రెస్ట్ కావాలని తీసుకున్న నిర్ణయంపై క్రికెట్ పండితులు, మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్ల నుంచి మంచి పాజిటివ్ స్పందన వచ్చింది...

ఎంతో డేరింగ్‌గా తన మనసులో మాట బయటపెట్టిన బెన్‌స్టోక్స్‌ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు క్రికెటర్లు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ శ్రీవాత్సవ్ గోస్వామి మాత్రం ఈ విషయంలో మరో విధంగా స్పందించాడు...

‘బెన్‌స్టోక్స్‌తో పాటు మిగిలిన అథ్లెట్లు, క్రికెటర్లు మెంటల్ హెల్త్ కోసం, మానసిక ప్రశాంతత కోసం బ్రేక్ తీసుకుంటున్నారు. అది వారి హక్కు కూడా. అయితే భారతీయుల్లో ఏ ప్లేయర్ కూడా ఈ విషయం గురించి ఎందుకని మాట్లాడలేకపోతున్నారు...

నాకు తెలిసి, వాళ్లంతా జనాలు ఏమనుకుంటున్నారో? అని భయపడుతుండొచ్చు... నిజానికి భారతదేశంలో మెంటల్ హెల్త్ గురించి మాట్లాడడం చాలా పెద్ద బూతులాంటిది కూడా...
భారతదేశంలో అథ్లెట్లు ఎందుకని మెంటల్ హెల్త్ గురించో, మానసిక ప్రశాంతత గురించో బ్రేకులు ఎందుకు తీసుకోరంటే... దానికి చాలా కారణాలు ఉన్నాయి...

1. మెంటల్ హెల్త్ ఇష్యూ గురించి వారికి తెలియకపోవడం. ప్రెషర్ అందరిలో ఉంటుంది. అయితే స్ట్రెస్ మాత్రం ఉండకూడదు...

2. విపరీతమైన పోటీ. మెంటల్ హెల్త్ కోసం విశ్రాంతి తీసుకుంటే, మన స్థానాన్ని వేరే ప్లేయర్ తీసుకుంటాడనే ఆందోళన...

3. ఇప్పటికీ ఇక్కడ ఈ విషయం గురించి మాట్లాడడం అంత ఈజీ కాదు...

4. ఒకవేళ ఎవరైనా ఈ విషయం గురించి మాట్లాడితే... అతన్ని సున్నిత మనస్కుడు, ఆటపైన ఆసక్తి లేదు, ఒత్తిడిని తీసుకోలేడు, ఫోకస్ లేదు, వేరే వాటిల్లో ఇంట్రెస్ట్ ఎక్కువ అనేస్తారు...

5. చాలామంది అయితే, ఇలా కూడా అవుతుందా? అని ఆశ్చర్యపోతారు... 6. మెంటల్ హెల్త్ గురించి మాట్లాడితే, ఓ వీక్ ప్లేయర్‌గా ముద్ర వేసేస్తారు...

7. ట్రోల్స్‌ను తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి...’ అంటూ వరుస ట్వీట్లు చేశాడు భారత క్రికెటర్ శ్రీవాత్సన్ గోస్వామి...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2008 అండర్19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న శ్రీవాత్సవ్ గోస్వామి, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడి విజయాన్ని అందించాడు.

అయితే ఆ తర్వాత అదే రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వకపోవడంతో శ్రీవాత్సవ్‌కి టీమిండియా నుంచి ఇప్పటిదాకా పిలుపు రాలేదు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టును ఆడే శ్రీవాత్సవ్‌‌కి పెద్దగా అవకాశాలు రాలేదు. 

click me!