అదే జరిగితే టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడం... ఆ లీగ్ విషయంలో పాక్, బీసీసీఐ మధ్య గొడవ...

First Published Aug 2, 2021, 11:46 AM IST

భారత్, పాక్ మధ్య ఉన్న వైరాన్ని మరింత పెంచేలా, పాక్ క్రికెట్ బోర్డు వేసిన ఎత్తులకు భారత క్రికెట్ బోర్డు పైఎత్తులు వేస్తోంది. భారత భూభాగంలోని కశ్మీర్‌ పేరుతో కశ్మీర్ ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) నిర్వహించేందుకు పీసీబీ సమాయత్తం అవుతుంటే, అది జరగకుండా ఉండేందుకు బీసీసీఐ పావులు కదుపుతోంది...

ind vs pak

కశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో ఏ దేశాల మాజీ క్రికెటర్లు పాల్గొన్నా, వారికి భారత్‌లోకి అనుమతి ఉండదని.. భారత్‌లో క్రికెట్ సంబంధిత వ్యవహారాల్లో పాలుపంచుకునేందుకు అవకాశం దక్కదని హెచ్చరికలు జారీ చేసింది భారత క్రికెట్ బోర్డు...

కశ్మీర్ ప్రీమియర్ లీగ్ ఆడితే, భారత్‌లోకి రానివ్వబోమంటూ బీసీసీఐ బెదిరింపులకు పాల్పడుతోందని, క్రికెట్‌లోకి ఇరుదేశాల మధ్య ఉన్న రాజకీయ వైరాన్ని తీసుకురావడం కరెక్ట్ కాదని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్ వేసిన ట్వీట్‌తో దుమారం రేగింది.

గిబ్స్ ట్వీట్‌ని ఆధారంగా తీసుకున్న పాక్ క్రికెట్ బోర్డు... బీసీసీఐ, కశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో విదేశీ క్రికెటర్లు పాల్గొనకుండా అడ్డుకుంటోందని, క్రికెట్‌లోకి అనవసర విషయాలను తేవడం కరెక్టు కాదంటూ ఐసీసీకి ఫిర్యాదు చేస్తూ ఓ లేఖ రాసింది...

దీంతో కశ్మీర్ ప్రీమియర్ లీగ్‌కి ఐసీసీ గుర్తింపు ఇవ్వకూడదంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలిని కోరింది భారత క్రికెట్ బోర్డు. ఈ టోర్నీ జరిగితే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం జరిగే అవకాశం ఉందని పేర్కొంది...

‘వాళ్లు పాక్ సూపర్ లీగ్‌ (పీఎస్‌ఎల్) రూపంలో ఎన్ని లీగ్స్ నిర్వహించుకున్నా మాకేం అభ్యంతరం లేదు. అయితే కశ్మీర్‌ పేరు మీద, దేశ సరిహద్దులో టోర్నీ నిర్వహించడం అమోదయోగ్యం కాదు. అందుకే మేం ప్రభుత్వ విధానాలను అనుసరిస్తున్నాం...

1947లో దేశ విభజన నుంచి కశ్మీర్ విషయంలో ఇరు దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అలాంటి సమయంలో కశ్మీర్ ప్రీమియర్ లీగ్ నిర్వహించడం కరెక్టు కాదు... ’ అంటూ తన వాదనను వినిపించింది బీసీసీఐ.

ఒకవేళ బీసీసీఐ మాట వినకుండా, కశ్మీర్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తే, టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్ ఆడదంటూ హెచ్చరించినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మాత్రం స్పష్టమైన ప్రకటనలు, సమాచారం రాలేదు...

ఇప్పటికే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ క్రికెటర్లు, కశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనడం లేదంటూ బీసీసీఐకి స్పష్టమైన హామీ ఇచ్చింది. అయితే శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్షాన్‌తో పాటు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్ ఈ టోర్నీలో ఆడే అవకాశం ఉంది.

click me!