వరల్డ్ ది బెస్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లీయే... రోహిత్ శర్మ, ధోనీలను ఓడించి మరీ...

First Published Sep 1, 2022, 6:29 PM IST

వరల్డ్ ది బెస్ట్ బ్యాటర్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే కొందరు సచిన్ టెండూల్కర్ ది గ్రేట్ అంటే, లేదు మాహీయే బెస్ట్ బ్యాటర్ అంటారు మరికొందరు. ఇంకొందరు రోహిత్ శర్మ ది బెస్ట్ అంటే, మరికొందరు వీరూనే టాప్ అంటారు.. అయితే వీరందరినీ వెనక్కి నెట్టి.. వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌గా ప్రేక్షకులతో మన్ననలు అందుకున్నాడు విరాట్ కోహ్లీ...

ప్రముఖ ఇంగ్లీష్ స్పోర్ట్స్ వెబ్‌సైట్, ఇండియాలో బెస్ట్ టీ20 బ్యాటర్ ఎవరో తేల్చాలంటూ ప్రేక్షకుల అభిప్రాయాలతో ఆన్‌లైన్ ఓటింగ్ నిర్వహించింది. రెండు గ్రూపులుగా నిర్వహించిన ఈ పోలింగ్‌లో మొదటి రౌండ్‌లో రోహిత్ శర్మ, మనీశ్ పాండే, శిఖర్ ధావన్, సురేష్ రైనా, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, యువరాజ్ సింగ్, దినేశ్ కార్తీక్ పోటీపడ్డారు...

Image credit: Getty

దినేశ్ కార్తీక్‌ని ఓడించి యువరాజ్, రిషబ్ పంత్‌ని వెనక్కి నెట్టి కెఎల్ రాహుల్... మనీశ్ పాండేని వెనక్కి నెట్టి రోహిత్ శర్మ, ధావన్‌ని ఓడించి సురేష్ రైనా ముందు రౌండ్‌కి వెళ్లారు. మరో గ్రూప్‌లో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వీరేంద్ర సెహ్వాగ్, ఎమ్మెస్ ధోనీ, గౌతమ్ గంభీర్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా పోటీపడ్డారు...

Image credit: Getty

జడ్డూ ఓడించి హార్ధిక్ పాండ్యా, గౌతీని ఓడించి ఎంఎస్ ధోనీ, సెహ్వాగ్‌ని ఓడించి సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్‌ని ఓడించి విరాట్ కోహ్లీ రెండో రౌండ్‌కి వెళ్లారు... రెండో రౌండ్‌లో రోహిత్ శర్మతో పోటీపడిన సురేష్ రైనా, యువరాజ్ సింగ్‌తో పోటీపడిన కెఎల్ రాహుల్... ప్రేక్షకుల చేత ఎక్కువ ఓట్లు దక్కించుకోలేకపోయారు...

అలాగే మరో రౌండ్‌లో సూర్యకుమార్ యాదవ్ కంటే విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా కంటే ఎంఎస్ ధోనీ ఎక్కువ ఓట్లు దక్కించుకున్నారు... ఇక్కడే ఫైట్ ఇంట్రెస్టింగ్‌గా మారింది... మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ మధ్య ఓటింగ్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరూ హోరాహోరీగా తలబడగా.. మాహీ కంటే ఎక్కువ ఓట్లు దక్కించుకుని ఫైనల్ చేరాడు విరాట్ కోహ్లీ...

Image credit: PTI

మరోవైపు యువరాజ్ సింగ్ కంటే టీమిండియా ప్రస్తుత సారథి రోహిత్ శర్మకు బాగానే ఓట్లు పడ్డాయి. ఫైనల్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇండియా ది బెస్ట్ టీ20 బ్యాటర్‌ టైటిల్ కోసం పోటీపడ్డారు... టీ20ల్లో నాలుగు సెంచరీలు, అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, విరాట్‌ని ఓడిస్తారని అనుకున్నారంతా... 

ఆసియా కప్‌కి ముందు విరాట్ కోహ్లీ ఫామ్ గురించి చాలా పెద్ద చర్చ కూడా జరిగింది. పెద్దగా ఫామ్‌లో లేక టీ20ల్లో విరాట్‌కి చోటు ఇవ్వకపోవడమే బెటర్ అనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. అయితే ఫైనల్‌లో అందరి అంచనాలు తలకిందులయ్యాయి.
 

virat rohit

అయితే మూడు ఫార్మాట్లలో పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీకే జనాలు నీరజనాలు పట్టారు. రోహిత్ శర్మ కంటే దాదాపు 20 శాతం ఎక్కువ ఓట్లు దక్కించుకున్న విరాట్ కోహ్లీ... వరల్డ్ ది బెస్ట్ టీ20 బ్యాటర్‌గా నిలిచాడు... 

click me!