కెఎల్ రాహుల్‌ని ఆడించొద్దంటారా... సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ ఆన్సర్...

First Published Sep 1, 2022, 5:17 PM IST

గాయం నుంచి కోలుకున్న తర్వాత కెఎల్ రాహుల్ బ్యాటు నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా రాలేదు. 2021 సీజన్‌లో బ్యాటుతో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి టీమిండియాకి వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ కూడా కొట్టేశాడు కెఎల్ రాహుల్...

Suryakumar Yadav KL Rahul

2022 ఏడాది మాత్రం కెఎల్ రాహుల్‌కి పెద్దగా కలిసి రావడం లేదు. ఈ ఏడాది ఆరంభంలోనే సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు కెఎల్ రాహుల్.. ఫలితం వైట్ వాష్...

Image Credit: PTI

కెప్టెన్‌గా వరుసగా మొదటి నాలుగు మ్యాచుల్లో పరాజయాలు ఎదుర్కొన్న కెఎల్ రాహుల్, చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం కెఎల్ రాహుల్‌కి ఈ ఏడాది బాగానే కలిసి వచ్చింది...

Image credit: Getty

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రూ.17 కోట్ల కాంట్రాక్ట్ దక్కించుకున్న కెఎల్ రాహుల్, తొలి సీజన్‌లో జట్టును ప్లేఆఫ్స్‌కి చేర్చగలిగాడు. అయితే ఐపీఎల్ తర్వాత గాయపడిన కెఎల్ రాహుల్, రెండు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు...

Image credit: Getty

జర్మనీ వెళ్లి హెర్నీయాకి శస్త్ర చికిత్స చేయించుకున్న కెఎల్ రాహుల్, విండీస్ టూర్‌కి ముందు కరోనా బారిన పడ్డాడు. కోలుకున్న తర్వాత జింబాబ్వే టూర్‌లో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...

ఆసియా కప్ 2022లో పాక్‌పై గోల్డెన్ డకౌట్ అయిన కెఎల్ రాహుల్, హంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో జిడ్డు బ్యాటింగ్‌తో ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. 39 బంతుల్లో 2 సిక్సర్లతో 36 పరుగులు చేసిన కెఎల్ రాహుల్‌ని తప్పించి... ఓపెనర్‌గా రిషబ్ పంత్‌ని ఆడించాలనే డిమాండ్ వినిపిస్తోంది...

KL Rahul

హంగ్ కాంగ్‌తో మ్యాచ్ అనంతరం మీడియాతో సమావేశమైన సూర్యకుమార్ యాదవ్‌కి కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఫన్నీగా స్పందించాడు సూర్యకుమార్ యాదవ్... ‘అంటే మీరు అనేది కెఎల్ రాహుల్‌ని ఆడించకూడదు అనేగా... ’ అంటూ నవ్వేసిన సూర్యకుమార్ యాదవ్, ‘అతను గాయం నుంచి కోలుకుని వస్తున్నాడు. కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది...  మనకి కూడా ఆ సమయం ఉంది...’ అంటూ చెప్పుకొచ్చాడు...

KL Rahul Bowled

‘రిషబ్ పంత్‌ని తప్పించడం, హార్ధిక్ పాండ్యాకి రెస్ట్ ఇవ్వడం అన్నీ టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయాలు. నేను కెప్టెన్‌ని కాదు, కనీసం వైస్ కెప్టెన్‌ని కూడా కాదు... కాబట్టి ఈ విషయాలు వాళ్లనే అడగండి...

Image credit: Getty

విరాట్ కోహ్లీతో కలిసి ఆడడం భలే మజాని ఇచ్చింది. రిషబ్ పంత్‌ టీమ్‌లో రావడం హ్యాపీ... ఇప్పటికైతే అంతా బాగానే ఉంది...’ అంటూ వివరించాడు సూర్యకుమార్ యాదవ్...
హంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 68 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. 25 టీ20లు ఆడిన సూర్యకుమార్ యాదవ్‌కి ఇది ఐదో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కావడం విశేషం...

click me!