కోహ్లీ ఫన్నీ సీన్! బ్యాటింగ్ చేయకుండానే గ్రౌండ్ నుంచి వెనుదిరిగాడు !

Published : Dec 07, 2024, 12:06 PM ISTUpdated : Dec 07, 2024, 12:10 PM IST

Virat Kohli Funny Incident Adelaide: ఆసీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయకుండానే వెనుదిరిగిన ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.   Virat Kohli is such a funny character 😂❤️ pic.twitter.com/NaYckaVPxy — Virat Kohli Fan Club (@Trend_VKohli) October 24, 2024

PREV
15
కోహ్లీ ఫన్నీ సీన్! బ్యాటింగ్ చేయకుండానే గ్రౌండ్ నుంచి వెనుదిరిగాడు !
Virat Kohli Funny Incident

అడిలైడ్ ఓవల్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు జరుగుతోంది. ఇది డే-నైట్ టెస్ట్ మ్యాచ్. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. అడిలైడ్‌ ఓవల్‌ వేదికగా జరుగుతున్న డే-నైట్‌ టెస్టు మ్యాచ్‌లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీ విరామ సమయానికి భారత్ 82 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా తరఫున మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ అద్భుతమైన బౌలింగ్ తో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. యశస్వి జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (37), విరాట్ కోహ్లీ (7), శుభ్‌మన్ గిల్ (31), రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఎవరూ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడ‌లేక‌పోయారు. దీంతో భార‌త్ 180 ప‌రుగుల‌కే తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయింది.  అయితే, విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో ఒక ఫన్నీ ఘటన జరిగింది.

25
విరాట్ కోహ్లీ ఇండియా vs ఆస్ట్రేలియా

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గావస్కర్ టెస్ట్ సిరీస్‌లోని రెండో మ్యాచ్ అడిలైడ్‌లో జరుగుతోంది. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ పగలు రాత్రి మ్యాచ్‌గా జరుగుతోంది. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇండియా 1-0తో ముందంజలో ఉంది. పింక్ బాల్ టెస్ట్‌లో ఇండియా చెత్త ఆరంభాన్ని పొందింది. కేవలం 180 పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డు సృష్టించింది. స్టార్ ప్లేయర్స్ కూడా ఆసీస్ బౌలర్ల వేగంతో తట్టుకోలేకపోయారు. అందులో విరాట్ కోహ్లీ కూడా ఒకరు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ 7 పరుగులు చేసి అవుటయ్యాడు.

35
Virat Kohli Funny Incident

అడిలైడ్‌ టెస్టు మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చాడు, అయితే అకస్మాత్తుగా అతను మైదానం నుండి తిరిగి రావాల్సి వచ్చింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్‌లో అద్భుతమైన డ్రామా కనిపించింది. ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ ఎనిమిదో ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అతని ముందు  కేఎల్ రాహుల్ స్ట్రైక్‌లో ఉన్నాడు. ఎనిమిదో ఓవర్‌లో స్కాట్ బోలాండ్ వేసిన తొలి బంతి అద్భుతంగా వేసి కేఎల్ రాహుల్ ను బోల్తా కొట్టించింది.

45
Virat Kohli Funny Incident

దీంతో విరాట్ కోహ్లీ గ్లౌస్‌లు వేసుకుని బ్యాటింగ్‌కు రెడీ అయి మైదానంలోకి దిగబోతుండగా, మరో ఘటనతో అతను బ్యాటింగ్ చేయకుండానే గ్రౌండ్ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. స్కాట్ బోలాండ్ వేసిన ఈ ప్రాణాంతక బంతిపై కేెల్ రాహుల్ తన బ్యాట్ తో అడ్డుకునే ప్రయత్నంలో విఫలం అయ్యాడు. ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు క్యాచ్ వెనుకకు అప్పీల్ చేశారు. అంపైర్ కూడా వేలు పైకెత్తి కేఎల్ రాహుల్ ఔట్‌గా సూచించాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ తన సహచరులతో కలిసి సంబరాలు చేసుకోవడం ప్రారంభించాడు. అదే సమయంలో, కేఎల్ రాహుల్ ఔట్‌గా భావించిన విరాట్ కోహ్లీ అతని స్థానంలో బౌండరీ లైన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత కథ ఒక్కసారిగా నాటకీయ మలుపు తిరిగింది.

55
Virat Kohli Funny Incident

అయితే, స్కాట్ బోలాండ్ వేసిన ఆ బంతిని నో బాల్ వేసినట్లు థర్డ్ అంపైర్ టీవీ రీప్లేలో గుర్తించారు. దీని తర్వాత స్కాట్ బోలాండ్ వేసిన బంతిని నో బాల్‌గా ప్రకటించారు. దీంతో కేఎల్ రాహుల్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. దీంతో రాహుల్ ముఖంలో సంతోషం కనిపించింది. ఇదే సమయంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన కోహ్లీ..బౌండరీ లైన్‌కు చేరిన తర్వాత అర్ధాంతరంగా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ హఠాత్పరిణామానికి విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఒక్క బంతి మ్యాచ్ లో ఫన్నీ సన్నివేశాన్ని సృష్టించింది.

Read more Photos on
click me!

Recommended Stories