సిరాజ్ నిజంగా 181.6 kph వేగంతో బౌలింగ్ వేశాడా?

Published : Dec 07, 2024, 11:34 AM ISTUpdated : Dec 07, 2024, 03:42 PM IST

Mohammed Siraj 181.6 kph Bowling Speed: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ 181.6 kph వేగంతో బంతి వేసి రికార్డ్ సృష్టించాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.

PREV
14
సిరాజ్ నిజంగా 181.6 kph వేగంతో  బౌలింగ్ వేశాడా?

Mohammed Siraj 181.6 kph Bowling Speed: భారత జట్టు ఆస్ట్రేలియాతో 5 టెస్ట్‌ల సిరీస్‌లో ఆడుతోంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. దీని తర్వాత అడిలైడ్‌ ఒవల్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఇది పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. స్టార్క్ వేసిన తొలి బంతికే యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కె.ఎల్.రాహుల్, శుభ్‌మన్ గిల్ ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొన్నారు.

24
టెస్ట్ ఫాస్టెస్ట్ డెలివరీ

స్కోరు 60 దాటిన తర్వాత కె.ఎల్.రాహుల్ 37 పరుగులకు స్టార్క్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ 31 పరుగులకే వెనుదిరిగాడు. రిషబ్ పంత్ (21), కెప్టెన్ రోహిత్ శర్మ (3), విరాట్ కోహ్లీ (7) కూడా స్టార్క్, బోలాండ్ బౌలింగ్‌ను తట్టుకోలేకపోయారు. దీంతో భారత్ 6 వికెట్లకు 109 పరుగులతో కష్టాల్లో పడింది. రవిచంద్రన్ అశ్విన్ (22), నితీష్ కుమార్ రెడ్డి (42) జట్టును కాస్త గౌరవప్రదమైన స్థితికి భారత్ స్కోర్ ను చేర్చారు.

టెయిలెండర్లు త్వరగా అవుట్ కావడంతో భారత్ 180 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా తరపున మిచెల్ స్టార్క్ 6 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. నాథన్ లియాన్ 38 పరుగులతో, మార్నస్ లబుషేన్ 20 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇక రెండో రోజు రెండో సెషన్ ఆరంభం వరకు ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది.

34
ఇండియా vs ఆస్ట్రేలియా టెస్ట్

అయితే, ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 24వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్‌లో అతను గంటకు 181.6 కి.మీ. (181.6 kph) వేగంతో బంతి వేసినట్లు స్కోర్‌బోర్డ్‌లో కనిపించింది. దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఎందుకంటే క్రికెట్‌లో అత్యంత వేగంగా బంతి వేసిన బౌలర్‌గా పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ రికార్డ్ సృష్టించాడు. అతను గంటకు 161.3 కి.మీ. వేగంతో బంతి వేశాడు. అది ఇప్పటికీ రికార్డ్‌గానే ఉంది. దీంతో సిరాజ్ అక్తర్ రికార్డును బద్దలు కొట్టి 181.6 కి.మీ. వేగంతో బంతి వేశాడని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసించడం ప్రారంభించారు.

44
సిరాజ్ బౌలింగ్ వేగం ఇండియా vs ఆస్ట్రేలియా 2వ టెస్ట్

కానీ నిజానికి సిరాజ్ 181.6 కి.మీ. వేగంతో బంతి వేయలేదు. ఆటోమేటిక్ స్కోర్‌బోర్డ్‌లో సాంకేతిక లోపం కారణంగా సిరాజ్ 181.6 కి.మీ. వేగంతో బంతి వేసినట్లు తప్పుగా చూపించబడింది. సిరాజ్ ఆ బంతిని గంటకు 147 కి.మీ. వేగంతో వేసి ఉంటాడని చెబుతున్నారు. అయితే, సిరాజ్ ప్రపంచ క్రికెట్ లో అత్యంత వేగవంతమైన బంతిని వేశాడని క్రికెట్ లవర్స్ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తించారు.

Read more Photos on
click me!

Recommended Stories