విరాట్ కోహ్లీ మరో రెండేళ్లు కెప్టెన్‌గా ఉండేవాడు, కానీ వాళ్లు ఓర్వలేరు... మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంట్స్...

First Published Jan 24, 2022, 9:23 AM IST

సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ... టెస్టుల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడైన విరాట్ కోహ్లీ, ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత వన్డే సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీని తప్పిస్తూ భారత క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయమే... విరాట్ నిర్ణయానికి కారణమని వార్తలు వినిపించాయి...

హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఉన్నంతకాలం భారత జట్టులో విరాట్ కోహ్లీ రాజ్యమే సాగింది. అయితే రెండేళ్లుగా ఫామ్‌లో లేక పరుగులు చేయలేకపోవడం, రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో విరాట్ కోహ్లీకి కష్టాలు మొదలయ్యాయి...

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం, అతని కెరీర్ గ్రాఫ్‌నే తలకిందులు చేసేసింది. కోహ్లీని తప్పించేందుకు అవకాశం కోసం చూస్తున్నవారికి స్వయంగా ఛాన్స్ ఇచ్చినట్టే అయ్యింది...

‘విరాట్ కోహ్లీ మరో రెండేళ్ల పాటు టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగేవాడు. అదీకాకుండా వచ్చే రెండేళ్లు మొత్తం భారత జట్టు స్వదేశంలోనే టెస్టు సిరీస్‌లు ఆడబోతోంది...

ఈజీగా విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీలో రికార్డు విజయాలు అందుకునేవాడు. కచ్చితంగా 10 మ్యాచుల్లో 9 విజయాలు వచ్చేవి. ర్యాంకింగ్స్‌లోనూ భారత జట్టు టాప్‌లో ఉండేది...

ఇప్పటికే 40 విజయాలు అందుకున్న విరాట్ కోహ్లీ, ఈజీగా 50- 60 టెస్టు విజయాలు అందుకుని, మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా మారేవాడు. అయితే చాలామంది విరాట్ ఈ విజయాలను సాధిస్తూ, చూసి ఓర్వలేరు...

మరో రెండేళ్ల పాటు తన భుజాల మీద జట్టు భారాన్ని నడిపించేవాడు విరాట్, అయితే ఇప్పుడు అతని నిర్ణయాన్ని మనం గౌరవించాల్సిందే. ఏ దేశంలో కూడా ఇలాంటి రికార్డులు అసాధారణం...

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో గెలిచాం, సౌతాఫ్రికాలో ఓడిపోయాం. అయితే సౌతాఫ్రికాలో ఓటమికి కెప్టెన్ కారణమా? వేరే కారణాలున్నాయా? అనే విషయంపై చర్చ జరిగింది...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీని పూర్తిగా ఎంజాయ్ చేసేవాడు, చేస్తున్నాడు. సచిన్ టెండూల్కర్ కానీ, ఎమ్మెస్ ధోనీ కానీ కెప్టెన్సీని భారంగా భావించినప్పుడే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు...

ఆరేళ్లలో విరాట్ కోహ్లీ 40 టెస్టులు గెలిచాడు, ఈ విజయాలే అతను క్రికెట్‌ను ఎంతలా ఎంజాయ్ చేస్తున్నాడో తెలుపుతున్నాయి... ’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

click me!