నేను విరాట్ కోహ్లీ ప్లేస్‌లో ఉంటే, పెళ్లి కూడా చేసుకునేవాడిని కాదు... షోయబ్ అక్తర్ కామెంట్...

First Published Jan 23, 2022, 6:18 PM IST

చేయడం కష్టం కానీ, ఇలా చేయమని చెప్పడం చాలా తేలిక. అందుకే సాయం చేసేవారికంటే సలహాలు ఇచ్చేవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ విషయంలోనూ ఇదే జరుగుతోంది. విరాట్ కోహ్లీపై పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ అక్తర్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. కేవలం భారత జట్టుకే కాకుండా ఆల్‌టైం గ్రేట్ కెప్టెన్లలో ఒకడిగా ఉన్న విరాట్ కోహ్లీ, అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న వారిలో టాప్ 4లో ఉన్నాడు. 

70 అంతర్జాతీయ సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన వారిలో మూడో ప్లేస్‌లో ఉన్నాడు... ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రమే విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు...

అయినా విమర్శకులకు మాత్రం విరాట్ కోహ్లీ లోకువైపోయాడు. కారణం అతను రెండేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతుండడమే. తాజాగా షోయబ్ అక్తర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు...

‘విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీని కావాలని ఇష్టపూర్వకంగా వదులుకోలేదు, వదులకునేలా చేశారు. అతనికి ఇప్పుడు టైం బాగోలేదు. అయితే అతను ఇప్పుడు మరోసారి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది...

తాను ఇనుముతో చేశారా? లేక వంచింతే వంగిపోయే స్టీల్‌తో చేశారా? అనేది తాను నిరూపించుకోవాలి. భారత జట్టుకి ఏడేళ్లుగా కెప్టెన్‌గా ఉన్నాడు విరాట్ కోహ్లీ... అయితే నాకైతే అతని కెప్టెన్సీ ఎప్పుడూ నచ్చలేదు...

నా వరకూ విరాట్ కోహ్లీ సెంచరీలు చేయడం, డబుల్ సెంచరీలు చేయడమే కావాలి. అతను బ్యాట్స్‌మెన్‌గా సెంచరీలు చేస్తే, నేను ఫ్యాన్‌గా చప్పట్లు కొడుతూ సంతోషిస్తా...

నేను విరాట్ కోహ్లీ ప్లేస్‌లో ఉండి ఉంటే, ఎప్పటికీ పెళ్లి చేసుకునేవాడిని కాదు. కేవలం పరుగులు చేస్తూ, క్రికెట్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. బ్యాట్స్‌మెన్‌గా ఈ 10-12 ఏళ్ల సమయం ఎప్పటికీ తిరిగి రాదు...

పెళ్లి చేసుకోవడం తప్పని అనడం లేదు, ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని కూడా చెప్పడం లేదు. అయితే భారత జట్టుకి ఆడుతున్నప్పుడు ఆ కాస్త సమయంలో క్రికెట్‌ని పూర్తిగా ఎంజాయ్ చేయాలి...

విరాట్ కోహ్లీ అంటే ఫ్యాన్స్‌కి పిచ్చి... గత 14 ఏళ్లుగా విరాట్ పొందుతున్న ఆదరాభిమానుల ముందు వైవాహిక జీవితం చాలా చిన్నది... పెళ్లి అయితే కుటుంబం, పిల్లలు అనే ప్రెషర్ ఉంటుంది...

కుటుంబ బాధ్యతలు పెరిగే కొద్దీ, క్రికెట్‌పై పూర్తి స్థాయి దృష్టిని పెట్టేలేం... ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫామ్‌ను అందుకోకపోవడానికి అదే కారణమని అనుకుంటున్నా... పెళ్లయ్యాక విరాట్ కోహ్లీ ఇంతకుముందులా పరుగులు చేయలేదనే నా ఉద్దేశం...’ అంటూ కామెంట్ చేశాడు షోయబ్ అక్తర్...

click me!