కెప్టెన్ విరాట్ కోహ్లీ అయినా, వాళ్లంతా అతని మాటే వినేవాళ్లు... దినేశ్ కార్తీక్ వ్యాఖ్యలు...

First Published Jan 23, 2022, 8:14 PM IST

విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. 7 ఏళ్ల క్రితం టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీ, నాలుగేళ్ల క్రితం మూడు ఫార్మాట్లలోనూ సారథిగా మారాడు. నాలుగు నెలల గ్యాప్‌లో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలు ఆడిన భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్... అతని కెప్టెన్సీపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

‘విరాట్ కోహ్లీ క్రీజులో పూర్తి ఎనర్జీతో కదులుతాడు, ఆ విషయంలో అతనికి పోటీ వచ్చేవారే లేరు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కూడా విరాట్ ఈ ఎనర్జీనే కొనసాగిస్తాడని అనుకుంటున్నా...

కెఎల్ రాహుల్‌తో పాటు రోహిత్ శర్మ కూడా జట్టుకి కావాల్సినప్పుడు  విరాట్ కోహ్లీలా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఇకపై విరాట్ కోహ్లీ బ్యాట్ సీటులో కూర్చుని బండిని నడపుతాడు...

నాకు తెలిసి ఇకపై విరాట్ కోహ్లీ కొంచెం ఇబ్బందిపడడం గ్యారెంటీ. ఇంతకుముందులా జట్టులో ఉత్సాహం నింపేందుకు ‘కమాన్ గయ్స’ అంటూ అరవలేడు...

కెప్టెన్సీ నుంచి ఓ సాధారణ ప్లేయర్‌గా పూర్తి స్థాయిలో రూపాంతరం చెందడానికి విరాట్ కోహ్లీకి కాస్త సమయం పడుతుంది. కేకేఆర్‌లో నా పరిస్థితి కూడా ఇలాంటిదే...

2020 సీజన్ మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు తర్వాతి మ్యాచ్‌లో ఓ సాధారణ ప్లేయర్‌గా ఉండేందుకు కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది...

టీ20, వన్డే ఫార్మాట్‌లో కెప్టెన్సీ పగ్గాలు విరాట్ కోహ్లీ చేపట్టిన తర్వాత కూడా టీమ్‌లో ఉన్న చాలామంది ప్లేయర్లకు ఎమ్మెస్ ధోనీయే సలహాలు, సూచనలు ఇచ్చేవాడు...

ఫీల్డ్ ప్లేస్‌మెంట్ దగ్గర్నుంచి, బౌలర్లకు వెనకాల నుంచి సలహాలు ఇచ్చేంతవరకూ ఎమ్మెస్ ధోనీ ముందుండేవాడు. కుల్దీప్ యాదవ్, అశ్విన్, చాహాల్ కూడా ధోనీ సలహాలను తూ.చ. తప్పకుండా పాటించేవాళ్లు...

విరాట్ కోహ్లీ కూడా ఇప్పుడు అలాంటి రోల్ పాటిస్తే బెటర్... అప్పుడు కెఎల్ రాహుల్‌పై కెప్టెన్సీ ప్రెషర్ కూడా తగ్గించినట్టు అవుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్...

click me!