తండ్రి చనిపోయినా కోహ్లీ ఆడేందుకు వెళ్లాడు, నువ్వు మీ అమ్మ కోసం వెళ్లలేవా... మహిళా క్రికెటర్ ప్రియా పూనియాకి..

Published : May 23, 2021, 03:00 PM IST

సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న మహిళా క్రికెటర్లలో స్మృతి మందాన తర్వాతి స్థానం ప్రియా పూనియాదే. ఆట కంటే అందంతో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ప్రియా పూనియా, వచ్చే నెల ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌కి ఎంపికైంది. అయితే ఈ మధ్యే ప్రియా పూనియా తల్లి సరోజ్, కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయింది.

PREV
18
తండ్రి చనిపోయినా కోహ్లీ ఆడేందుకు వెళ్లాడు, నువ్వు మీ అమ్మ కోసం వెళ్లలేవా... మహిళా క్రికెటర్ ప్రియా పూనియాకి..

ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికైన సంతోషంలో ప్రియా పూనియా ఉన్న సమయంలోనే మే 18న కరోనాతో పోరాడుతూ ప్రాణాలు విడిచింది ఆమె తల్లి సరోజ్ పూనియా. తల్లి ఆకస్మిక మరణం నుంచి కోలుకోలేకపోయిన ఆమె, క్రికెట్‌ ఆడేందుకు ఏ మాత్రం ఇష్టపడలేదట. 

28

భార్య దూరమై దుఖంలో ఉన్న తండ్రిని ఒంటరిగా వదిలేసి వెళ్లలేనని చెప్పిందట. దీంతో ఆమె తండ్రి సురేందర్ పూనియా, విరాట్ కోహ్లీ గురించి చెప్పి ఆమెలో స్ఫూర్తిని నింపాడట.

38

‘కొన్నిసార్లు జీవితంలో తగిలే దెబ్బలను ఎదురొడ్డి నిలబడాల్సి ఉంటుంది. తల్లిని కోల్పోయిన ఆమెకు స్ఫూర్తి నింపాలని అనుకున్నా. అప్పుడే నాకు విరాట్ కోహ్లీ గుర్తుకువచ్చాడు...

48

భారత మెన్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 18 ఏళ్ల వయసులో తన తండ్రిని కోల్పోయినా, ఆ బాధను దిగమింగుతూ రంజీ మ్యాచ్ ఆడడానికి వెళ్లాడు. ఆ మ్యాచ్‌లో సెంచరీ చేసి, తన తండ్రికి అంకితం ఇచ్చాడు. అమ్మకి కూడా అలాంటి నివాళి కావాలి...

58

మా కుటుంబానికి ఇది చాలా క్లిష్టమైన సమయం. అవకాశం చాలామంది ఎదురుచూస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే, మళ్లీ ఛాన్స్ వస్తుందో లేదో తెలీదు. వెళ్లి క్రికెట్ ఆడమని చెప్పాను. పాప ఒప్పుకుంది. ఆడతానని చెప్పింది’ అంటూ చెప్పుకొచ్చాడు సురేందర్ పూనియా.

68

మే 19 నుంచి ముంబైలో క్వారంటైన్‌లో గడుపుతున్న ఇండియా పురుషుల, మహిళల జట్లు జూన్ 2న ఒకే విమానంలో ఇంగ్లాండ్ టూర్‌కి బయలుదేరి వెళ్లనున్నాయి. ఈ టూర్‌లో టీమిండియా మహిళలు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడతారు.

78

కరోనా వైరస్ కారణంగా తల్లినీ, అక్కనీ కోల్పోయిన భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌వుమెన్ వేదా కృష్ణమూర్తికి మాత్రం ఇంగ్లాండ్ టూర్‌కి ప్రకటించిన జట్టులో చోటు దక్కకపోవడం విశేషం. 

88

24 ఏళ్ల ప్రియా పూనియా, ఇప్పటిదాకా 5 వన్డేలు ఆడి 175 పరుగులు చేసింది. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 3 టీ20 మ్యాచులు ఆడినా కేవలం 9 పరుగులే చేయగలిగింది. ప్రియా పూనియా, ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌లో చోటు దక్కించుకుంది.

click me!

Recommended Stories