ఓ టీమ్‌లో సచిన్, మరో టీమ్‌లో గంగూలీ... 23 ఏళ్ల క్రితమే ఒకేసారి రెండు టోర్నీలు ఆడిన టీమిండియా...

Published : May 23, 2021, 01:35 PM IST

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడేందుకు ఇంగ్లాండ్‌కి వెళ్లబోతున్న టీమిండియా... ఒకేసారి రెండు వేర్వేరు జట్లతో రెండు విభిన్న సిరీస్‌లు ఆడబోతున్న విషయం తెలిసిందే. ఇటు విరాట్ సేన ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడబోతుంటే, మరోవైపు యువకులతో నిండిన మరో జట్టు శ్రీలంకలో వన్డే, టీ20 సిరీస్ ఆడబోతోంది.

PREV
18
ఓ టీమ్‌లో సచిన్, మరో టీమ్‌లో గంగూలీ... 23 ఏళ్ల క్రితమే ఒకేసారి రెండు టోర్నీలు ఆడిన టీమిండియా...

ఓ జట్టు, ఇలా ఒకేసారి రెండు విభిన్న టోర్నీలు ఆడడం ఇదే తొలిసారి అని చాలామంది భావిస్తున్నారు. అయితే టీమిండియాకి ఇది రెండోసారి. ఇంతకుముందు 23 ఏళ్ల క్రితమే, 1998లో ఇలా ఒకేసారి రెండు జట్లతో బరిలో దిగి రెండు వేర్వేరు జట్లతో సిరీస్‌లు ఆడింది టీమిండియా...

28

1998లో అజయ్ జడేజా కెప్టెన్సీలో ఓ జట్టు, మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో మరో జట్టు ఒకేసారి రెండు భిన్నమైన టోర్నీలు ఆడాయి. 1998 కామన్వెల్త్ గేమ్స్‌కి అజయ్ జడేజా కెప్టెన్సీలోని భారత జట్టు బరిలో దిగింది.

38

జడేజా టీమ్‌లో సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే వంటి ప్లేయర్లు సభ్యులుగా ఉన్నారు. అదే సమయంలో పాకిస్తాన్‌తో అజారుద్దీన్ కెప్టెన్సీలో సహారా కప్ ఆడింది టీమిండియా. అజారుద్దీన్ టీమ్‌లో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, జవగళ్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్ వంటి ప్లేయర్లు సభ్యులుగా ఉన్నారు.

48

అయితే అప్పట్లో టీమిండియా చేసిన ఈ ప్రయోగం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. 16 జట్లు పాల్గొన్న కామన్వెల్త్ గేమ్స్‌లో ఆసీస్‌తో ఓడిన టీమిండియా, కెనడాపై గెలిచింది. అర్జెంటీనాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో టీమిండియా గ్రూప్ స్టేజ్ నుంచే నిష్కమించాల్సి వచ్చింది.

58

కామన్వెల్త్ గేమ్స్ నుంచి నిష్కమించడంతో ఆ జట్టులోని సచిన్, అజయ్ జడేజా, అనిల్ కుంబ్లే, రాబిన్ సింగ్‌లను సహారా కప్‌లో ఆడించాలని భావించింది బీసీసీఐ. అయితే అప్పటికే టోర్నీ మొదలుకావడంతో జట్టులో లేని ప్లేయర్లను ఆడించేందుకు పాకిస్తాన్ బోర్డు నిరాకరించింది.

68

దీంతో సచిన్ టెండూల్కర్, తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌కి వెళ్లిపోయాడు. ఎట్టకేలకు టెండూల్కర్, అజయ్ జడేజాలను తుదిజట్టులో చేర్చడానికి పాక్‌ని ఒప్పించింది బీసీసీఐ. అయితే సచిన్ ఎక్కడున్నాడో కూడా తెలుసుకోలేకపోయిన బీసీసీఐ, జడేజాని మాత్రం ఒక్క మ్యాచ్‌లో ఆడించగలిగింది...

78

ఫైనల్ మ్యాచ్ సమయానికి సచిన్ టెండూల్కర్ తిరిగి రావడంతో ఆఖరి మ్యాచ్‌లో అతను బరిలో దిగాడు. అయితే అప్పటికే 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకున్న పాకిస్తాన్, ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి 4-1 తేడాతో సిరీస్ గెలిచింది. సచిన్ టెండూల్కర్ 77 పరుగులు, అజారుద్దీన్ సెంచరీ చేసినా ఆమీర్ సోహైల్ 97 పరుగులు చేసి పాక్‌కి విజయాన్ని అందించాడు.

88

మళ్లీ ఇన్నాళ్లకు ఒకేసారి రెండు టోర్నీలు ఆడబోతోంది టీమిండియా. 28 ఏళ్ల క్రితం మహ్మద్ అజారుద్దీన్, అజయ్ జడేజా సాధించలేనిది... ఇప్పుడు విరాట్ కోహ్లీ అండ్ శిఖర్ ధావన్ (ఇండియా బీ జట్టు కెప్టెన్సీ ధావన్‌కే దక్కే ఛాన్స్ ఉంది) సాధిస్తారేమో వేచి చూడాలి...

click me!

Recommended Stories