రోహిత్, స్మిత్, విలియంసన్, మేం ఎవరం విరాట్ కోహ్లీని అందుకోలేం... డేవిడ్ వార్నర్ ఇన్‌స్టా పోస్ట్...

First Published May 23, 2021, 12:35 PM IST

ప్రస్తుత తరంలో బెస్ట్ క్రికెటర్ ఎవరు? కొన్నిరోజులుగా క్రికెట్ ప్రపంచంలో ఈ ప్రశ్నమీదే చర్చ జరుగుతోంది. కొందరు కేన్ విలియంసన్ గ్రేట్ అంటే, మరికొందరు స్టీవ్ స్మిత్‌ తోపు అంటున్నారు. ఇంకొందరైతే వీరంతా కాదు జో రూట్, రోహిత్ శర్మలే లెజెండ్స్ అంటున్నారు. అయితే డేవిడ్ వార్నర్ ఈ ప్రశ్నకు మరోసారి క్లియర్‌గా సమాధానం ఇచ్చేశాడు.

ప్రస్తుత తరంలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా, అత్యధిక శతకాలు బాదిన కెప్టెన్‌గా ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు విరాట్ కోహ్లీ. గత రెండేళ్లుగా సెంచరీ మార్కు అందుకోవడానికి ఇబ్బంది పడుతున్నా, 2008 నుంచి 2019 వరకూ కోహ్లీ ఓ రన్ మెషిన్‌లా పరుగులు సాధించాడు.
undefined
దీంతో మిగిలిన ప్లేయర్లకి అందనంత ఎత్తులో 70 శతకాలతో టాప్‌లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఇందులో కెప్టెన్‌గా సాధించిన శతకాలే 41 కావడం విశేషం. మాజీ ఆసీస్ కెప్టెన్, మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్రికెట్ కెప్టెన్‌గా గుర్తింపు పొందిన రికీ పాంటింగ్ రికార్డు సమం చేశాడు కోహ్లీ...
undefined
విరాట్ కోహ్లీ 70 సెంచరీలతో టాప్‌లో ఉంటే, ప్రస్తుత తరంలో మిగిలిన ఎవ్వరూ కూడా 50+ మార్కును కూడా అందుకోలేకపోయారు. దీంతో ‘మేం ఎవ్వరం విరాట్‌తో పోటీపడడానికి అర్హులం కాదు... మేం కోహ్లీని అందుకోలేం అని చెప్పడమే సమంజసం’ అంటూ కామెంట్ పెట్టాడు డేవిడ్ వార్నర్..
undefined
క్రికెట్‌లో కొనసాగుతున్నవారిలో అత్యధిక సెంచరీలతో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉండే, డేవిడ్ వార్నర్ 43 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. 22 ఏళ్లుగా క్రికెట్ కెరీర్ కొనసాగిస్తున్న 41 ఏళ్ల విండీస్ వీరుడు, ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్ 42 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు.
undefined
రోహిత్ శర్మ 40 సెంచరీలతో నాలుగో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ సీనియర్ మోస్ట్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ కూడా 40 శతకాలు సాధించాడు.
undefined
విరాట్ కోహ్లీతో పోటీపడే ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఆరు, ఏడో స్థానాల్లో ఉండడం విశేషం. స్టీవ్ స్మిత్ 38 సెంచరీలతో ఆరో స్థానంలో ఉండగా స్మిత్ సాధించిన సెంచరీల్లో 27 సెంచరీలు టెస్టుల్లోనే సాధించాడు.
undefined
కేన్ విలియంసన్ 37 అంతర్జాతీయ సెంచరీలతో ఏడో స్థానంలో ఉన్నాడు. కేన్ సాధించిన సెంచరీల్లో 24 సెంచరీలు టెస్టుల్లో చేయగా, వన్డేల్లో 13 సెంచరీలు చేశాడు.
undefined
ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ 36 సెంచరీలతో 8వ స్థానంలో ఉన్నాడు. కొన్నాళ్లుగా వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకోలేకపోతున్న జో రూట్, టెస్టుల్లో 20 సెంచరీలు చేశాడు.
undefined
భారత సీనియర్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ 24 సెంచరీలతో టాప్ 9లో ఉండగా, ఫాఫ్ డుప్లిసిస్ 23 సెంచరీలతో టాప్ 10లో ఉన్నాడు. శిఖర్ ధావన్ సెంచరీల్లో 17 వన్డేల్లో సాధించినవి కాగా, టెస్టుల్లో 10 సెంచరీలు చేసిన డుప్లిసిస్ ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
undefined
టాప్ 10లో ఉన్నవారిలో క్రిస్ గేల్, రాస్ టేలర్‌ కెరీర్ దాదాపు ముగిసినట్టే. మిగిలిన ప్లేయర్లు కూడా 32 నుంచి 37 ఏళ్ల మధ్యలోపు వాళ్లే. మహా అయితే మరో నాలుగైదు ఏళ్లు మాత్రమే క్రికెట్‌లో కొనసాగగలరు. ఎలా చూసినా వీరిలో ఎవ్వరూ విరాట్ కోహ్లీ రికార్డును అందుకోవడం అసాధ్యమే.
undefined
click me!