ధోనీ అంటే నమ్మకం, అంతకుమించి... మాహీ గురించి విరాట్ కోహ్లీ అభిప్రాయం ఇదే...

First Published May 30, 2021, 10:09 AM IST

భారత ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీకి, మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. ధోనీ నాయకత్వంలో జట్టులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, అదిరిపోయే పర్ఫామెన్స్‌తో స్టార్ బ్యాట్స్‌మెన్‌గా, ఆ తర్వాత సారథిగా ఎదిగాడు.

మహేంద్ర సింగ్ ధోనీ టెస్టుల నుంచి తప్పుకున్నాక సుదీర్ఘ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా మారిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత భారత జట్టుకి పూర్తిస్థాయి సారథిగా మారాడు. ధోనీ లేకపోతే విరాట్ కోహ్లీ ఈ రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకునేవాడు కాదు.
undefined
కెప్టెన్‌గా టెస్టు టీమ్‌ను ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ టీమ్‌గా మార్చిన విరాట్ కోహ్లీ, విదేశాల్లో ఇంతకుముందున్నడూ సాధ్యం కాని రికార్డు విజయాలను అందించాడు.
undefined
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ టూర్‌కి బయలుదేరబోతున్న విరాట్ కోహ్లీ, ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్‌లో గడుపుతున్నాడు. ఈ సమయంలో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు విరాట్.
undefined
కెప్టెన్‌ కూల్‌తో మీకున్న అనుబంధం గురించి రెండు ముక్కల్లో చెప్పాలని ఓ అభిమాని కోరగా... దానికి సమాధానంగా ‘ట్రస్ట్, రెస్పెక్ట్... నమ్మకం, గౌరవం’ అంటూ రిప్లై ఇచ్చాడు విరాట్ కోహ్లీ...
undefined
టీమిండియా ఆడిన మ్యాచుల్లో మహేంద్ర సింగ్ ధోనీని మిస్ అవుతున్నామని... ‘మిస్ యూ ధోనీ’ బోర్డులను ప్రదర్శించగా... విరాట్ కోహ్లీ తాను కూడా మిస్ అవుతున్నట్టు చేతి సైగలతో చూపించిన విషయం తెలిసిందే...
undefined
వారం రోజుల కఠిన క్వారంటైన్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి, రోహిత్ శర్మ... నేడు హోటల్ గదుల నుంచి బయటికి రానున్నారు. జూన్ 2న ఇంగ్లాండ్‌కి బయలుదేరి వెళ్లబోతున్న భారత జట్టు, ఈ మూడు రోజులు కూడా క్వారంటైన్‌లో గడుపుతారు. అయితే హోటల్ గదిలో నుంచి బయటికి రావడానికి అవకాశం దొరుకుతుంది.
undefined
తనపై వచ్చే విమర్శలకు, ట్రోలింగ్‌కి మీరిచ్చే సమాధానం ఏంటని ఓ అభిమాని అడగగా... తన బ్యాటుతోనే సమాధానం చెబుతానని సెంచరీ సెలబ్రేషన్స్ పిక్‌ను పోస్టు చేశాడు...
undefined
భారత జట్టు తరుపున అత్యధిక టెస్టులకు నాయకత్వం వహించిన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లీ. మహేంద్ర సింగ్ ధోనీ 60 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించి, టెస్టు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే...
undefined
టెస్టు కెప్టెన్‌గా అత్యధిక విజయాలు అందుకున్న భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచి... తన కెప్టెన్సీ కెరీర్‌లో మిగిలిన ఐసీసీ టైటిల్ లోటును పూడ్చుకోవాలని చూస్తున్నాడు.
undefined
click me!