సురేశ్ రైనా గొప్పా? రోహిత్ శర్మ గొప్పా... సోషల్ మీడియాలో డిఫరెంట్ క్రికెట్ ఫ్యాన్స్ వార్...

First Published | May 29, 2021, 5:19 PM IST

సురేశ్ రైనా, రోహిత్ శర్మ... ఇద్దరూ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టులోకి వచ్చినవాళ్లే. సురేశ్ రైనా కెరీర్ ఆరంభంలో అదరగొట్టి, ఆ తర్వాత జట్టుకి దూరమైతే, రోహిత్ శర్మ కెరీర్‌ ఆరంభంలో కుదురుకోవడానికి ఇబ్బంది పడి, ఆ తర్వాత టీమిండియాలో స్టార్‌గా ఎదిగాడు.

రోహిత్ శర్మకు, సురేశ్ రైనాకి ఎలాంటి వైరం లేదు. అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులు యూఏఈలో నిర్వహించబోతున్నట్టు బీసీసీఐ ప్రకటించడంతో ‘హిట్ మ్యాన్’ వర్సెస్ ‘మిస్టర్ ఐపీఎల్’ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది.
యూఏఈలో జరిగిన గత సీజన్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ టైటిల్ సాధించి, ఐపీఎల్‌లో ఐదో టైటిల్ కైవసం చేసుకుంది...

అదే టైంలో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారి ప్లేఆఫ్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి, దారుణమైన పర్ఫామెన్స్ ఇచ్చింది.
అయితే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 సీజన్‌కి దూరంగా ఉన్న సురేశ్ రైనా, ఈ ఏడాది లీగ్‌లో రీఎంట్రీ ఇచ్చి తన స్టైల్‌లో అదరగొట్టాడు.
రైనాకి తోడు అంబటి రాయుడు, మొయిన్ ఆలీ, రుతురాజ్ గైక్వాడ్, సామ్ కుర్రాన్ వంటి ప్లేయర్లు రాణించడంతో ఇప్పటికే ఏడింట్లో ఐదు విజయాలు అందుకున్న సీఎస్‌కే, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
యూఏఈలో జరిగ ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో రోహిత్ శర్మ మళ్లీ తన కెప్టెన్సీతో ముంబై ఇండియన్స్‌కి హ్యాట్రిక్ టైటిల్స్ అందిస్తాడని ‘హిట్ మ్యాన్’ ఫ్యాన్స్ అంటుంటే... లేదు, ఈసారి ‘మిస్టర్ ఐపీఎల్’ సురేశ్ రైనా ఉన్నాడని, అతను సీఎస్‌కేకి నాలుగో టైటిల్ అందిస్తాడని అంటున్నారు చెన్నై ఫ్యాన్స్.
ఈ చర్చ కాస్తా సాగి సాగి... రోహిత్ శర్మ వర్సెస్ సురేశ్ రైనాగా మారింది సోషల్ మీడియాలో... రోహిత్ శర్మ భారత జట్టులో కుదురుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో సురేశ్ రైనా, టీమ్‌కి అద్భుత విజయాలు అందించాడని అతని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
సురేశ్ రైనా తన మొత్తంలో 226 వన్డేల్లో ఐదు సెంచరీలు చేస్తే, రోహిత్ శర్మ వన్డే వరల్డ్‌కప్ 2019 టోర్నీలోనే ఐదు సెంచరీలు చేశాడని... రైనాని రోహిత్ శర్మతో పోల్చడం పెద్ద కామెడీ అంటున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్...
సురేశ్ రైనా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి 2011 వరకూ 3250 పరుగులు చేస్తే, రోహిత్ శర్మ ఇదే టైమ్‌లో 1810 పరుగులే చేశాడని... రోహిత్ పూర్ పర్ఫామెన్స్‌తో జట్టుకి దూరమైన సమయంలోనే రైనా మ్యాచ్ విన్నర్‌గా ఉన్నాడంటున్నారు అతని అభిమానులు.
ఇన్నాళ్లు విరాట్ కోహ్లీతో పోటీపడి, రోహిత్ శర్మనే బెస్ట్ అండ్ బెటర్ అంటూ వాదిస్తూ వచ్చిన ముంబై ఇండియన్స్ అభిమానులు, ఈసారి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన రైనాతో పోలుస్తూ పోస్టులు చేస్తుండడం విశేషం.

Latest Videos

click me!