టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ... టీ20 వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్‌గా రోహిత్ శర్మ...

First Published Sep 16, 2021, 6:20 PM IST

కొన్నాళ్లుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ, విరాట్ కోహ్లీ... టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. టీ20ల్లో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విరాట్ కోహ్లీ, యూఏఈ వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్ టోర్నీయే పొట్టి ఫార్మాట్‌లో తనకి కెప్టెన్‌గా చివరి టోర్నీ అంటూ తెలిపాడు...

Virat Kohli

‘భారత జట్టుకి ఆడడం, కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా... భారత క్రికెట్ జట్టులో కెప్టెన్‌గా నాకు ప్రతీ ఒక్కరూ ఎంతగానో సహకరించారు...
నా బాయ్స్, సపోర్టింగ్ స్టాఫ్, సెలక్షన్ కమిటీ, నా కోచ్‌లు... భారత జట్టులోని ప్రతీ ఒక్కరి సహకారం లేనిదే నేను ఇది సాధించేవాడిని కాదు...

వర్క్ లోడ్‌ను అర్థం చేసుకోవడం చాలా అవసరం. మూడు ఫార్మాట్లలో ఆడుతూ, ఐదారేళ్లుగా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నా... నాకు కొంచెం స్పేస్ కావాలని నాకే అనిపిస్తోంది...
అయినా టెస్టులు, వన్డేల్లో కెప్టెన్‌గా కొనసాగడానికి సిద్దంగా ఉన్నా, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని, బ్యాట్స్‌మెన్‌గా కొనసాగాలని నిర్ణయం తీసుకున్నా... 

అనేక చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా. దీనిపై రవి భాయ్ (రవిశాస్త్రి), రోహిత్‌లతో ఇప్పటికే చర్చించా... అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా...

ఈ విషయం గురించి బీసీసీఐ సెక్రటరీ జే షా, అధ్యక్షుడు సౌరవ్ గంగూలీలతో కూడా చర్చించా... క్రికెటర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతాను...’ అంటూ లేఖ ద్వారా తెలియచేశాడు విరాట్ కోహ్లీ...
 

భారత సారథి విరాట్ కోహ్లీ, టీమిండియాకే కాదు వరల్డ్‌ టెస్టు మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్లలో ఒకడు. టీ20, వన్డేల్లో కూడా కోహ్లీకి మంచి రికార్డు ఉంది. అయితే ఐసీసీ ఈవెంట్లలో మాత్రం విరాట్ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు...

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఓడిన టీమిండియా, ఆ తర్వాత 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌లో, ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది...

ఐపీఎల్ కెరీర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా 8 సీజన్లుగా ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు విరాట్ కోహ్లీ... 
అదే టైంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఐదు టైటిల్స్ అందుకున్నాడు. ఇదే విరాట్‌ కోహ్లీకి ఇబ్బందులు తీసుకొచ్చింది...

టీ20, వన్డేల్లో టీమిండియా కెప్టెన్సీని రోహిత్ శర్మకి అప్పగించాలని దాదాపు రెండేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు ‘హిట్ మ్యాన్’ అభిమానులు...

రెండేళ్లుగా బ్యాటుతో సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్న విరాట్ కోహ్లీ... టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగినా, వన్డే, టీ20ల్లో కెప్టెన్సీని రోహిత్‌కి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.. అయితే కేవలం టీ20 కెప్టెన్సీ మాత్రమే వదులుకున్న విరాట్, టెస్టులతో పాటు వన్డేల్లో కూడా కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు...

భారత మహిళా క్రికెట్ జట్టులో వన్డే, టెస్టులకు మిథాలీరాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే... టీ20 కెప్టెన్సీని హర్మన్‌ప్రీత్ కౌర్ చూసుకుంటోంది. ఇప్పుడు పురుషుల జట్టులో కూడా సేమ్ సీన్ రిపీట్ కానుంది.

click me!