మళ్లీ అలాగే జరుగుతుందా... ఐపీఎల్ తర్వాత టీ20 వరల్డ్‌కప్, ఆటగాళ్లు అలసిపోతే...

First Published Sep 16, 2021, 4:20 PM IST

మరో మూడు రోజుల్లో ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2 ప్రారంభం కానుంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. దీంతో ఎడతెడపి లేని ఆట కారణంగా కీ ప్లేయర్లు అలిసిపోతారేమోననే భయం అభిమానుల్లో మొదలైంది...

వన్డే వరల్డ్‌కప్ 2019 టోర్నీకి ముందు ఐపీఎల్ సీజన్ జరిగింది. ఆ సీజన్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఫైనల్ చేరడంతో కీ ప్లేయర్లు అందరూ పాల్గొనాల్సి వచ్చింది...

భారత ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఎమ్మెస్ ధోనీ వంటి ప్లేయర్లు, ఐపీఎల్ ఫైనల్‌లో పాల్గొన్నారు...

2019 ఐపీఎల్ సీజన్‌ ముగించుకుని, ఇంగ్లాండ్ చేరిన భారత జట్టు... అక్కడ వన్డే వరల్డ్‌కప్‌ను ఘనంగా మొదలెట్టింది. గ్రూప్ స్టేజ్‌లో వరుసగా మ్యాచులు గెలిచి, టేబుల్ టాపర్‌గా నిలిచింది...

అయితే ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో ఆటగాళ్ల పర్ఫామెన్స్‌పై బిజీ షెడ్యూల్ ఎఫెక్ట్ తీవ్రంగా ప్రభావం చూపించినట్టు స్పష్టంగా కనబడింది...

వర్షం కారణంగా రెండురోజుల పాటు జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయి, 18 పరుగుల తేడాతో ఓడింది భారత జట్టు...

ఈసారి కూడా ఐపీఎల్ టోర్నీ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో పాల్గొననుంది భారత జట్టు... దాంతో మళ్లీ 2019 సీన్ రిపీట్ అవుతుందేమోనని భయపడుతున్నారు టీమిండియా అభిమానులు...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీ సమయానికి జస్ప్రిత్ బుమ్రా, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు ఫిట్‌గా ఉండడం... టీమిండియాకి అత్యంత అవశ్యకం...

అయితే ఏ ఫ్రాంఛైజీ కోసం ఇలాంటి కీ ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వడానికి అంగీకరించదు. ఎందుకంటే వారికి టీ20 వరల్డ్‌కప్ కంటే ఐపీఎల్ టైటిల్ గెలవడం ముఖ్యం...

‘టీ20 వరల్డ్‌కప్‌కి ముందు ఐపీఎల్ రావడం, టీమిండియా పర్ఫామెన్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై జట్లు ముందు వరుసలో ఉన్నాయి...

ఈ జట్లలోనే టీమిండియా కీ ప్లేయర్లు ఉన్నారు. ఈ జట్లు ప్లేఆఫ్ చేరితే... భారత ఆటగాళ్లకు ఏ మాత్రం విశ్రాంతి దొరకదు... మెగా టోర్నీకి ముందు రెస్ట్ లేకపోతే ఏమవుతుంది... ’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సబా కరీం...

ఇప్పటికే ఐపీఎల్ కోసం ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు రద్దు చేసుకున్నారనే అపవాదు మోస్తున్న భారత జట్టు, టీ20 వరల్డ్‌కప్‌లో ఓడితే మాత్రం... తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది...

click me!