కొడుకు కోసం రంగంలోకి దిగిన సచిన్ టెండూల్కర్... తండ్రి సారథ్యంలో బరిలోకి అర్జునుడు...

First Published Sep 16, 2021, 4:40 PM IST

క్రికెట్‌లో వారసత్వం పెద్దగా వర్కవుట్ అయ్యింది చాలా తక్కువ.  సునీల్ గవాస్కర్ కొడుకు రోహన్ గవాస్కర్ దగ్గర్నుంచి, కృష్ణమాచారి శ్రీకాంత్ కొడుకు అనిరుథ్ శ్రీకాంత్, రోజర్ బిన్నీ కొడుకు స్టువర్ట్ బిన్నీ... భారత జట్టుకి ఎంపికైనా తండ్రుల్లా జట్టులో స్థిరమైన స్థానం సంపాదించుకోలేకపోయారు...

‘క్రికెట్ గాడ్’గా కీర్తి దక్కించుకుని, ‘భారత రత్న’ వంటి దేశ అత్యున్నత పురస్కారాన్ని దక్కించుకున్న సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా భారత జట్టు తరుపున ఆరంగ్రేటం చేయాలని తెగ తహతహలాడుతున్నాడు...

బ్యాట్స్‌మెన్‌గా జట్టులోకి వచ్చేందుకు తీవ్రమైన పోటీ ఉండడంతో పేస్ ఆల్‌రౌండర్‌గా మారిన అర్జున్ టెండూల్కర్‌ను ఐపీఎల్ 2021 వేలంలో బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...

అయితే ఇండియాలో జరిగిన ఐపీఎల్ 2021 ఫేజ్ 1లో అర్జున్ టెండూల్కర్‌‌కి జట్టులో అవకాశం దక్కలేదు. కనీసం డగౌట్‌లో కూడా ఎక్కడా కనిపించలేదు అర్జున్...

అయితే ఈసారి మాత్రం అర్జున్ టెండూల్కర్‌ని జట్టులో కాకపోయినా డగౌట్‌లో చూడడం మాత్రం పక్కా. ఎందుకంటే కొడుకు కోసం తానే బరిలో దిగబోతున్నాడు సచిన్ టెండూల్కర్...

ముంబై ఇండియన్స్‌ మెంటర్‌గా తిరిగి బాధ్యతలు తీసుకున్న సచిన్ టెండూల్కర్, ఇప్పటికే యూఏఈ చేరి క్వారంటైన్‌లో గడుపుతున్నాడు...

తండ్రి సచిన్ టెండూల్కర్ సారథ్యంలో అర్జునుడు, ఐపీఎల్ 2021 సమరంలో దిగబోతున్నాడు. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌లో మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉన్నారు...

క్రిస్ లీన్ వంటి భారీ హిట్టర్, జేమ్స్ ప్యాటిన్సన్, ధవల్ కులకర్ణి, జేమ్స్ నీశమ్, ఆదిత్య తారే వంటి సీనియర్లు కూడా తుది జట్టులో చోటు కోసం ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి...

అలాంటి జట్టులోకి అర్జున్ టెండూల్కర్ చోటు దక్కించుకోగలడా? అనేది అనుమానమే. అయితే మెంటర్ తలుచుకుంటే, జట్టు ఎలాంటి మార్పులైనా సాధ్యమేనని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

ఒకవేళ అదే జరిగి, అన్యూహ్యంగా తుదిజట్టులో అర్జున్ టెండూల్కర్ చోటు దక్కించుకుంటే మాత్రం... సచిన్ టెండూల్కర్‌తో పాటు ముంబై ఇండియన్స్ జట్టు కూడా నెపోటిజం ట్రోల్స్‌ని తీవ్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది...

click me!