ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మరో రికార్డు ఫీట్... 6 వేల పరుగుల క్లబ్‌లోకి ఎంట్రీ...

First Published Apr 22, 2021, 11:29 PM IST

క్రికెట్ వరల్డ్‌లో రికార్డుల రారాజుగా పేరొందిన విరాట్ కోహ్లీ, మరో రికార్డు క్రియేట్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దేవ్‌దత్ పడిక్కల్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన కోహ్లీ... అద్భుత హాఫ్ సెంచరీతో ఐపీఎల్‌లో 6 పరుగుల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 

ఐపీఎల్ చరిత్రలోనే 6 వేల పరుగులు పూర్తిచేసుకున్న మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ... సురేశ్ రైనా 5448, శిఖర్ ధావన్ 5428, డేవిడ్ వార్నర్ 5384 పరుగులతో కోహ్లీ తర్వాతి స్థానాల్లో టాప్ 4లో ఉన్నారు...
undefined
ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 38 హాఫ్ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, టీమిండియా తరుపున టీ20ల్లో సారథిగా 12 హాఫ్ సెంచరీలు బాదాడు. మొత్తంగా టీ20ల్లో 50 హాఫ్ సెంచరీలు బాదిన కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ...
undefined
మొదటి వికెట్‌కి అజేయంగా 181 పరుగులు జోడించిన విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, ఆర్‌సీబీకి వరుసగా నాలుగో విజయం అందించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఐపీఎల్‌లో మొదటి వికెట్‌కి ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.
undefined
47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ముంబైలో 3 వేల టీ20 పరుగులు పూర్తిచేసుకోవడం మరో విశేషం. అలాగే ఐపీఎల్‌లో ఆరుసార్లు 150+ భాగస్వామ్యాలు నమోదుచేసిన ఏకైక ప్లేయర్‌గా ఉన్నాడు విరాట్ కోహ్లీ...
undefined
20 ఏళ్ల 289 రోజుల వయసులో తొలి సెంచరీ పూర్తిచేసిన దేవ్‌దత్ పడిక్కల్, ఐపీఎల్‌లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. మనీశ్ పాండే (19 ఏళ్ల 253 రోజులు), రిషబ్ పంత్ (20 ఏళ్ల 218 రోజులు) దేవ్‌దత్ పడిక్కల్ కంటే ముందున్నారు.
undefined
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున దేవ్‌దత్ పడిక్కల్ చేసిన సెంచరీ 14వ శతకం. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు నమోదుచేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ (13)ను దాటేసింది ఆర్‌సీబీ...
undefined
ఐపీఎల్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలవడం ఆర్‌సీబీకి ఇదే తొలిసారి. ఇంతకుముందు 2008లో సీఎస్‌కే, 2009లో డెక్కన్ ఛార్జర్స్, 2014లో పంజాబ్, 2015లో రాజస్థాన్ రాయల్స్ ఈ ఫీట్ సాధించాయి.
undefined
ఆర్‌సీబీ తరుపున క్రిస్‌గేల్ 5, విరాట్ కోహ్లీ 5, ఏబీ డివిల్లియర్స్ 2, మనీశ్ పాండే ఒకటి, పడిక్కల్ ఓ సెంచరీ చేశారు. అయితే చేధనలో సెంచరీ చేసిన మూడో ఆర్‌సీబీ ప్లేయర్ పడిక్కల్. ఇంతకుముందు 2011లో గేల్, 2016లో కోహ్లీ ఈ ఫీట్ సాధించారు.
undefined
రాజస్థాన్ రాయల్స్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్, ఐపీఎల్‌లో అత్యధికసార్లు ఈ ఫీట్ సాధించిన జట్టుగా నిలిచింది. ఆర్‌సీబీ నాలుగు సార్లు వికెట్లేమీ కోల్పోకుండా గెలవగా సన్‌రైజర్స్, ముంబై, చెన్నై సూపర్ కింగ్స్ రెండేసి సార్లు ఈ ఫీట్ సాధించారు.
undefined
click me!