రాయల్స్‌కి చుక్కలు చూపించిన దేవ్‌దత్ పడిక్కల్, కోహ్లీ... ఆర్‌సీబీ ఖాతాలో వరుసగా నాలుగో విక్టరీ...

Published : Apr 22, 2021, 10:58 PM IST

గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి దొరికిన యంగ్ డైనమెట్ దేవ్‌దత్ పడిక్కల్, ఐపీఎల్ 2021 సీజన్‌లో మొదటిసారి తన విశ్వరూపం చూపించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడి బౌండరీల మోత మోగించాడు. ఆగ్నికి వాయువు తోడైనట్టు విరాట్ కోహ్లీ కూడా తన స్టైల్‌లో హాఫ్ సెంచరీ బాదడంతో వరుసగా నాలుగో విజయం అందుకుంది ఆర్‌సీబీ...

PREV
17
రాయల్స్‌కి చుక్కలు చూపించిన దేవ్‌దత్ పడిక్కల్, కోహ్లీ... ఆర్‌సీబీ ఖాతాలో వరుసగా నాలుగో విక్టరీ...

178 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏ దశలో ఇబ్బంది పడలేదు. ముఖ్యంగా యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్, రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

27

క్రిస్ మోరిస్, ముస్తాఫిజుర్, రాహుల్ తెవాటియా... ఇలా బౌలర్లు మారినా, తన మారదన్నట్టు సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు దేవ్‌దత్ పడిక్కల్... 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న పడిక్కల్, ఆ తర్వాత మరింత దూకుడు పెంచాడు...

37

దేవ్‌దత్ పడిక్కల్‌ బౌండరీల మోత మోగిస్తుండడంతో అతనికి స్ట్రైయికింగ్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చిన విరాట్ కోహ్లీ... మొదటి 28 బంతుల్లో కేవలం 33 పరుగులు మాత్రమే చేశాడు.

47

అయితే పడిక్కల్ ఊపు చేసిన విరాట్ కోహ్లీ, తాను కూడా బౌండరీల మోత మోగించడం మొదలెట్టాడు. క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో ఓ సిక్సర్, ఫోర్ బాదిన విరాట్ కోహ్లీ... హాఫ్ సెంచరీతో పాటు 6 వేల ఐపీఎల్ పరుగులు పూర్తిచేసుకున్నాడు.

57

ఐపీఎల్ చరిత్రలోనే 6 వేల పరుగులు పూర్తిచేసుకున్న మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ... సురేశ్ రైనా 5448, శిఖర్ ధావన్ 5428, డేవిడ్ వార్నర్ 5384 పరుగులతో కోహ్లీ తర్వాతి స్థానాల్లో టాప్ 4లో ఉన్నారు...

67

మొదటి వికెట్‌కి అజేయంగా 181 పరుగులు జోడించిన విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, ఆర్‌సీబీకి వరుసగా నాలుగో విజయం అందించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఐపీఎల్‌లో మొదటి వికెట్‌కి ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. 

77

17వ ఓవర్ మొదటి బంతికి బౌండరీ బాదిన దేవ్‌దత్ పడిక్కల్, 52 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆర్‌సీబీ విజయానికి కావాల్సిన పరుగులు వైడ్స్ రూపంలో రాగా కోహ్లీ 47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు, పడిక్కల్ 101 పరుగులతో అజేయంగా నిలిచి 10 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్‌కి ఘన విజయాన్ని అందించారు.

click me!

Recommended Stories