కపిల్‌దేవ్, ఎమ్మెస్ ధోనీ తర్వాత విరాట్ కోహ్లీయే... చరిత్ర సృష్టించిన ‘కింగ్’...

Published : Aug 17, 2021, 09:32 AM IST

‘క్రికెట్ మక్కా’ లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేస్తూ, అద్వితీయ విజయాన్ని అందుకుంది భారత జట్టు. నాటింగ్‌హమ్‌లో వర్షం కారణంగా విజయాన్ని అందుకోలేకపోయిన టీమిండియా... లార్డ్స్ టెస్టు ఆఖరి రోజు పూర్తి డామినేషన్ కనబర్చి, ఆతిథ్య జట్టుకి ఊహించని షాక్ ఇచ్చింది... ఈ విజయంతో భారత సారథి విరాట్ కోహ్లీ కొన్ని అరుదైన రికార్డులను క్రియేట్ చేశాడు...

PREV
18
కపిల్‌దేవ్, ఎమ్మెస్ ధోనీ తర్వాత విరాట్ కోహ్లీయే... చరిత్ర సృష్టించిన ‘కింగ్’...

లార్డ్స్ మైదానంలో టెస్టు మ్యాచ్ గెలిచిన మూడో భారత సారథిగా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ... ఇంతకుముందు 1986లో కపిల్‌దేవ్, 2014లో ఎమ్మెస్ ధోనీ మాత్రమే ఈ మైదానంలో టెస్టు విజయాలను అందుకున్నారు...

28

ఈ విజయంతో సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో ఐద విజయాన్ని అందుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ దేశాల్లో అత్యధిక విజయాలు అందుకున్న ఆసియా ఖండ కెప్టెన్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు విరాట్... 

38

అలాగే ఈ విజయం భారత సారథి విరాట్ కోహ్లీకి 37వ టెస్టు విక్టరీ... అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా ఉన్న విరాట్, గ్రేమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41) తర్వాతి స్థానంలో నిలిచాడు..

48

లార్డ్స్ టెస్టులో 8 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు మహ్మద్ సిరాజ్... 1982లో అప్పటి కెప్టెన్ కపిల్‌దేవ్ ఈ రికార్డు క్రియేట్ చేయడం విశేషం..

58

1982లో కపిల్‌దేవ్ 168 పరుగులిచ్చి 8 వికెట్లు తీయగా... 126 పరుగులకే 8 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్... లార్డ్స్ టెస్టులో భారత్ తరుపున అత్యుత్తమ గణాంకాలు నమోదుచేసిన బౌలర్‌గా నిలిచాడు...

68

భారత స్పిన్నర్లు వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం ఇది రెండోసారి... ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా ఎంట్రీ ఇచ్చిన మొదటి రెండు మ్యాచుల్లో భారత స్పిన్నర్లు ఉన్నా వారికి వికెట్లు దక్కలేదు...

78

టెస్టుల్లో టాస్ ఓడిపోయిన తర్వాత మ్యాచ్ గెలవడం విరాట్ కోహ్లీకి ఇది ఆరోసారి... సౌరవ్ గంగూలీ ఐదు సార్లు, ఎమ్మెస్ ధోనీ నాలుగుసార్లు ఈ ఫీట్ సాధించారు. టాస్ ఓడి, విజయాన్ని అందుకోవడంలోనూ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు..

88

కెప్టెన్ జో రూట్ సెంచరీ చేసిన తర్వాత కూడా ఇంగ్లాండ్ మ్యాచ్ ఓడిపోవడం ఇదే మొట్టమొదటిసారి... ఇంతకుముందు 16 సార్లు ఇంగ్లాండ్‌కి విజయం దక్కగా, ఐదు మ్యాచులు డ్రాగా ముగిశాయి...

click me!

Recommended Stories