ఫామ్‌లో లేకున్నా, రికార్డులు మాత్రం ఆగడం లేదు... టెండూల్కర్‌ మరో రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ...

First Published Sep 2, 2021, 5:19 PM IST

రన్ మెషిన్ విరాట్ కోహ్లీ రెండేళ్లుగా ఫామ్‌లో లేడు. సెంచరీ చేసి దాదాపు రెండేళ్లు దాటిపోయింది. ఇంగ్లాండ్ టూర్‌లో అయితే పరుగులు చేయడానికి తె ఇబ్బంది పడుతున్నాడు. అయితే రికార్డుల ప్రవాహం మాత్రం ఆగడం లేదు...

నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో తనదైన స్ట్రెయిట్ డ్రైవ్ బాది, ఖాతా తెరిచిన విరాట్ కోహ్లీ... అంతర్జాతీయ కెరీర్‌లో 23 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు...

అత్యంత వేగంగా 23 వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా మాజీ క్రికెటర్, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ...

సచిన్ టెండూల్కర్ తన 522 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించగా, విరాట్ కోహ్లీ కేవలం 490 ఇన్నింగ్స్‌ల్లోనే 23 వేల పరుగుల మైలురాయిని అందుకుని, టాప్‌లో నిలిచాడు...

సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్ 544 ఇన్నింగ్స్‌ల్లో, జాక్వస్ కలీస్ 551 ఇన్నింగ్స్‌ల్లో, కుమార సంగర్కర 568 ఇన్నింగ్స్‌ల్లో, రాహుల్ ద్రావిడ్ 576 ఇన్నింగ్స్‌ల్లో అధగమించి... టాప్ 6లో వరుసగా ఉన్నారు...

20వ శతాబ్దంలో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసి, 23 వేల పరుగుల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు 2008లో ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ...

అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన మూడో భారత ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ తర్వాతి స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులు చేయగా రాహుల్ ద్రావిడ్ 24,208 పరుగులు చేశారు...

సచిన్ టెండూల్కర్ 2004లో 23 వేల పరుగుల మైలురాయిని అందుకోగా... రికీ పాంటింగ్ 2009, కలీస్ 2010, రాహుల్ ద్రావిడ్ 2011లో, కుమార సంగర్కర, జయవర్థనే 2013లో ఈ ఫీట్‌ని అధిగమించారు. 8 ఏళ్ల తర్వాత ఈ మైలురాయిని అందుకున్నాడు విరాట్ కోహ్లీ..

21 వేల పరుగుల నుంచి 22 వేల పరుగులను అందుకునేందుకు 27 ఇన్నింగ్స్‌లు వాడుకున్న విరాట్ కోహ్లీ, 23 మైలురాయిని అందుకునేందుకు 28 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు..

click me!