బంగ్లాదేశ్ ఏంటి మరీ ఇలా తయారైంది... అప్పుడు ఆస్ట్రేలియాను, ఇప్పుడు న్యూజిలాండ్‌ను...

First Published Sep 2, 2021, 4:51 PM IST

క్రికెట్‌లో బంగ్లాదేశ్ అంటే పసికూనలని అనేవాళ్లు. చిన్నచిన్న జట్లపై ఈజీగా విజయాలు అందుకున్నా, పెద్ద టీమ్‌లను ఓడించడానికి బంగ్లాదేశ్ చాలా కష్టపడేది. ఎంతమంది స్టార్లు ఉన్నా, విజయాలు మాత్రం దక్కేవి కావు. అయితే ఇప్పుడు బంగ్లా టీమ్ వేరు... వాళ్ల ఆట వేరు...

బంగ్లాకి ఓ అలవాటు ఉంది. ఎప్పుడు ఎలా ఆడతారో వాళ్లకే తెలీదు. మోస్ట్ అన్‌ప్రీడక్టబుల్ టీమ్స్‌లో బంగ్లా కూడా ఒకటి.  2007 వన్డే వరల్డ్‌కప్‌లో ఫెవరెట్‌గా బరిలో దిగిన భారత్‌కి ఊహించని షాక్ ఇచ్చింది బంగ్లాదేశ్...

అయితే ఆ విజయం తర్వాత బంగ్లాదేశ్‌కి పెద్దగా విజయలు దక్కలేదు. ఆడపాదడపా విజయాలు అందుకుంటూ, టాప్‌ టీమ్‌లపై ఆడడానికి కష్టపడుతూ వచ్చింది...

గత ఏడాది కాలంగా బంగ్లాదేశ్ ఆటతీరు చూసినవాళ్లకి మాత్రం... అసలిది ఆ బంగ్లా టీమ్‌యేనా? అనే అనుమానం కలగడం ఖాయం... టాప్ టీమ్‌లకు చుక్కలు చూపిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు బంగ్లా పులులు...

స్వదేశంలో ఆస్ట్రేలియాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో ఓడించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది బంగ్లాదేశ్. అయితే అది ఓ గాలివాటు విజయం అనుకున్నారంతా...

ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌నూ సంచలన ప్రదర్శనతో ఆరంభించింది బంగ్లాదేశ్. టాప్ టీమ్‌గా ఉన్న న్యూజిలాండ్‌ను 60 పరుగులకే ఆలౌట్ చేసి, క్రికెట్ ప్రపంచం అవాక్కయ్యేలా చేసింది బంగ్లా...

అంతకుముందు ఆస్ట్రేలియాను 62 పరుగులకే ఆలౌట్ చేసిన బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌ను 60 పరుగులకే పెవిలియన్ చేర్చి.. కివీస్ ఖాతాలో చెత్త రికార్డును చేర్చింది..

ముఖ్యంగా స్వదేశంలో బంగ్లా ఆల్‌రౌండర్లు షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ నిప్పులు చెదిరే బంతులతో టాప్ టీమ్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడంతో సూపర్ సక్సెస్ అవుతున్నారు...

అదీకాకుండా బంగ్లాదేశ్ జట్టును తక్కువ అంచనా వేసి, బీ టీమ్‌లతో అక్కడ పర్యటించేందుకు వెళ్లిన ఆస్ట్రేలియా భారీ మూల్యం చెల్లించుకోగా... న్యూజిలాండ్ కూడా అదే తప్పు చేసింది... 

స్వదేశంలో ఇచ్చినట్టుగానే యూఏఈలో కూడా ఇలాంటి ప్రదర్శనే ఇస్తే... టీ20 వరల్డ్‌కప్ 2020లో టాప్ టీమ్‌లకు కూడా ఊహించని షాక్ ఇవ్వగలదు బంగ్లాదేశ్. సూపర్ 12కి అర్హత సాధించలేకపోయిన బంగ్లా, గ్రూప్ స్టేజ్‌లో తలబడబోతోంది.

click me!