విరాట్ కోహ్లీని అడ్డుకుంటోంది అదేనా... ఎన్ని విమర్శలు వచ్చినా మార్పులు చేయకుండా...

First Published Sep 2, 2021, 4:11 PM IST

టీమిండియా చరిత్రలో మోస్ట్ అగ్రెసివ్ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ. మిగిలిన భారత క్రికెట్ సారథులతో పోలిస్తే, విరాట్ కోహ్లీ సమయంలో రిజర్వు బెంచ్ ఎప్పుడూ లేనంత బలిష్టంగా తయారైంది. ఒక్కో ప్లేస్ కోసం ఇద్దరు ముగ్గురు ప్లేయర్ల మధ్య పోటీ నెలకొని ఉంది...

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఓపెనర్‌ శుబ్‌మన్ గిల్ గాయపడడం, ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన, వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో మరో ఇద్దరు ప్లేయర్లను పట్టుబట్టి మరీ ఇంగ్లాండ్‌కి రప్పించుకున్నాడు విరాట్ కోహ్లీ..

శ్రీలంక టూర్‌లో ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చిన ఓపెనర్ పృథ్వీషా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌... అటు నుంచి నేరుగా ఇంగ్లాండ్ చేరుకున్నారు...

ఈ ఇద్దరితో పాటు మయాంక్ అగర్వాల్, హనుమ విహారి వంటి బ్యాట్స్‌మెన్ రిజర్వు బెంచ్‌లో ఉన్నారు... అయితే వీరిలో ఏ ఒక్కరికి కూడా మొదటి నాలుగు మ్యాచుల్లో తుదిజట్టులో చోటు దక్కలేదు...

పూజారా, రహానే వరుసగా ఫెయిల్ అవుతుండడంతో నాలుగో టెస్టులో ఈ నలుగురిలో ఇద్దరు తుదిజట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ వంటి టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌తో బరిలో దిగే అవకాశం ఉందని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు... అయితే కోహ్లీ మాత్రం ఆ సాహసం చేయలేకపోయాడు..

విరాట్ కోహ్లీ టీమ్‌లో పెద్దగా మార్పులు చేయకపోవడానికి అతని పూర్ పర్ఫామెన్స్ కారణమని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ విశ్లేషకులు...

మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ మినహా విరాట్ కోహ్లీ పెద్దగా పరుగులు చేసింది లేదు. కోహ్లీతో పోలిస్తే అజింకా రహానే, పూజారా...రెండో టెస్టులో విలువైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను క్లిష్ట సమయంలో ఆదుకున్నారు...

అదీకాకుండా ఛతేశ్వర్ పూజారా... మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేసి మంచి టచ్‌లోకి వచ్చినట్టు కనిపించాడు... నెమ్మదిగా ఆడుతూ స్కోరుబోర్డును స్థంభింపచేస్తాడని విమర్శలు ఎదుర్కొన్న పూజారా, తన స్టైల్‌కి విరుద్ధంగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు...

ప్రస్తుత జట్టులో టీమిండియాకి నిజంగా భారంగా మారింది ఇద్దరే... విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్. విరాట్ కోహ్లీ నుంచి ఫ్యాన్స్ ఆశించే కెప్టెన్‌ ఇన్నింగ్స్‌లు రావడం లేదు...

తాను బ్యాటింగ్‌లో రాణించి, మిగిలిన ప్లేయర్లు విఫలమయ్యి ఉంటే, జట్టులో ఇప్పటికే సంచలన మార్పులు జరిగి ఉండేవని, తానే ఫెయిల్ అయినప్పుడు మార్పులు చేస్తే, ట్రోల్స్ కంటే ఎక్కువగా జట్టులోని ప్లేయర్ల నుంచే వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆలోచనలో పడ్డాడట విరాట్...

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఎదురైన పరాభవం నుంచి విరాట్ కోహ్లీ ఇంకా తేరుకోనట్టే అనిపిస్తోంది. అందుకే రవిచంద్రన్ అశ్విన్‌ లాంటి స్పిన్నర్ కూడా ఇంగ్లాండ్‌లో వికెట్లు తీయలేడని బలంగా ఫిక్స్ అయ్యాడు విరాట్ కోహ్లీ...

అలాగే యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా వరుసగా విఫలమవుతున్నాడు. మొదటి రెండు టెస్టుల్లో కొన్ని మెరుపులతో పర్వాలేదనిపించినా... మూడో టెస్టులో దారుణంగా ఫెయిల్ అయ్యాడు...

మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 3 పరుగులే చేసిన రిషబ్ పంత్‌ను పక్కనబెట్టే సాహసం చేయలేదు టీమిండియా. ఎందుకంటే ఆస్ట్రేలియా టూర్ తర్వాత బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు రిషబ్ పంత్...

ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్‌కి టీమ్‌లో సరైన పోటీ కూడా లేదు. సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఉన్నా, అతని బ్యాటింగ్ స్టైల్ పూజారా జిడ్డు బ్యాటింగ్‌కి పోటీ ఇచ్చేలా ఉంటుంది...

ఈ కారణంగానే వృద్ధిమాన్ సాహాను కేవలం కంకూషన్ సబ్‌స్టిట్యూట్ కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తున్నాడు విరాట్ కోహ్లీ...

అదీకాకుండా కోహ్లీ కంటే రవీంద్ర జడేజా మెరుగ్గా పరుగులు చేస్తుండడం కూడా అతన్ని తుదిజట్టులో కొనసాగించడానికి కారణంగా చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు...

ఐదో టెస్టులో అయినా జట్టులో సాహసం చేసి మార్పులు చేయాలంటే విరాట్ కోహ్లీ, ఫామ్‌లోకి వచ్చి ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇవ్వాల్సిందే. లేదంటే ఆఖరి టెస్టులో కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ విశ్లేషకులు..

click me!