కోహ్లీ కెప్టెన్‌గా ఉండి ఉంటే, వన్డే వరల్డ్ కప్ గెలిచేవాడు! రోహిత్‌కి చాలా కష్టం... పాక్ మాజీ కామెంట్

Published : Aug 17, 2023, 01:16 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో హాట్ ఫెవరెట్లుగా బరిలో దిగుతున్నాయి ఇండియా, పాకిస్తాన్. ఇండియాలో జరుగుతున్న ప్రపంచ కప్ కావడంతో ఇక్కడి పిచ్, వాతావరణ పరిస్థితులు ఉపఖండ దేశాలకు బాగా ఉపయోగపడతాయి. అయితే పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ మాత్రం ఈ రెండు జట్లు, వరల్డ్ కప్ గెలవడం కష్టమేనని అంటున్నాడు..

PREV
18
కోహ్లీ కెప్టెన్‌గా ఉండి ఉంటే, వన్డే వరల్డ్ కప్ గెలిచేవాడు! రోహిత్‌కి చాలా కష్టం... పాక్ మాజీ కామెంట్

అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ, నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగే గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. ఈ టోర్నీకి ఇంకా నెలన్నర సమయం మాత్రమే ఉంది..
 

28

‘చాలామంది వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని టీమిండియా గెలుస్తుందని, పాకిస్తాన్ గెలుస్తుందని అంటున్నారు. కానీ నా ఉద్దేశంలో మాత్రం ఈ రెండు జట్లు కూడా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి టాప్ టీమ్స్‌ని ఫేస్ చేయడంలో చాలా ఇబ్బంది పడతాయి..

38
Image credit: PTI

ముఖ్యంగా ఈ రెండు జట్లకు ఉన్న సమస్య మిడిల్ ఆర్డర్‌. మధ్య ఓవర్లలో వికెట్లు పడకుండా కాపాడుకుంటూ స్ట్రైయిక్ రేటు తగ్గకుండా జాగ్రత్త పడుతూ పరుగులు చేయాల్సి ఉంటుంది. అయితే అదిల్ రషీద్, మొయిన్ ఆలీ వంటి స్పిన్నర్ల బౌలింగ్‌లో పరుగులు రాబట్టడం అంత తేలికైన విషయం కాదు..

48

ఈ ఇద్దరితో పాటు న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి టీమ్స్ కూడా వరల్డ్ కప్ కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాయి. కచ్ఛితంగా ఈ నాలుగు టీమ్స్, ఆసియా దేశాలను తీవ్రంగా ఇబ్బందిపెడతాయి...
 

58
Virat Kohli-Rohit Sharma

భారత టీమ్ మేనేజ్‌మెంట్, మిడిల్ ఆర్డర్‌లో చాలా మంది ప్లేయర్లతో ప్రయోగాలు చేసింది. అయితే ఏదీ వర్కవుట్ కాలేదు. నెం.4 నుంచి నెం.7 వరకూ బ్యాటింగ్ పొజిషన్లలో కొత్త ప్లేయర్లను తీసుకువచ్చి, ఇలాంటి టోర్నీలు ఆడించడం మూర్ఖత్వమే అవుతుంది..

68

ఎందుకంటే ఈ పొజిషన్లలో అనుభవం ఉన్న ఆటగాళ్ల అవసరం చాలా ఉంటుంది. బౌలింగ్ మార్పులకు తగ్గట్టుగా బ్యాటింగ్ స్టైల్ కూడా మార్చుకుంటూ ఉండాలి.  విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగి ఉంటే, ఈపాటికి వరల్డ్ కప్ టీమ్‌ని 100 శాతం రెఢీ చేసేవాడు..

78

అతనికి బౌలర్లను ఎలా వాడాలో తెలుసు, ఏ ప్లేయర్‌, ఏ పొజిషన్‌కి సెట్ అవుతాడో బాగా తెలుసు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో సరైన టీమ్ లేకపోయినా టీమిండియా, గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా నిలిచింది...

88

మిగిలిన జట్లకు ఇండియాలో విరాట్ కోహ్లీ టీమ్‌ని ఓడించడం అసాధ్యమే అయ్యేది.. రోహిత్ శర్మకు అలాంటి టీమ్ లేదు, అతనికి అంత సమయం కూడా దొరకలేదు. కాబట్టి రోహిత్ సేనకు కష్టమే..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ రషీద్ లతీఫ్.. 

Read more Photos on
click me!

Recommended Stories