Published : Apr 11, 2023, 05:17 PM ISTUpdated : Apr 11, 2023, 05:19 PM IST
మొన్నా మధ్య పాక్ సూపర్ లీగ్‌లో బాబర్ ఆజమ్‌ని ఓ ఆటాడుకున్న న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ ధుల్, ఇప్పుడు విరాట్ కోహ్లీని కూడా అదే లెవెల్లో విమర్శించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దూకుడుగా బ్యాటింగ్ ఆరంభించిన విరాట్ కోహ్లీ, 40+ స్కోరు దాటిన తర్వాత నెమ్మదిగా ఆడడమే.. దీనికి కారణం..
పవర్ ప్లలో 56 పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 7 నుంచి 13 ఓవర్ల మధ్య 48 పరుగులు రాబట్టగలిగింది. చివరి 7 ఓవర్లలో 108 పరుగులు రాబట్టడంతో ఆర్‌సీబీ స్కోరు 200+ మార్కు దాటింది. మొదటి ఓవర్‌లో ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో 6,4 బాదిన విరాట్ కోహ్లీ, మార్క్ వుడ్ బౌలింగ్‌లోనూ అదే జోరు కొనసాగించాడు.
పవర్ ప్లే ముగిసే సమయానికి 25 బంతుల్లో 42 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత నెమ్మదించాడు. రవి భిష్ణోయ్, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించని విరాట్ కోహ్లీ, 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంటే 8 పరుగులు చేయడానికి 10 బంతులు వాడుకున్నాడు..
310
Image credit: PTI
ఈ కారణంగా ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో 7, 8, 9 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాలేదు. హాఫ్ సెంచరీ తర్వాత కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో సిక్సర్ బాదిన విరాట్ కోహ్లీ, 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 25 బంతుల్లో 42 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత 19 బంతుల్లో 19 పరుగులే చేశాడన్నమాట..
410
‘విరాట్ కోహ్లీ బుల్లెట్ ట్రైన్‌లా ఇన్నింగ్స్ మొదలెట్టాడు. ఆ తర్వాత ఏమైందో కానీ ఎడ్ల బండిలా నెమ్మది అయిపోయాడు. ఆరంభంలో చాలా షాట్లు ఆడిన విరాట్ కోహ్లీ, 42 పరుగుల నుంచి 50 పరుగుల మార్కు అందుకోవడానికి 10 బంతులు వాడుకున్నాడు...
510
Image credit: PTI
హాఫ్ సెంచరీ గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఉందా? అతని హాఫ్ సెంచరీ టీమ్‌ని గెలిపించేలా ఉండాలా? లేక ఓడించేలానా? చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. చాలా ఓవర్లు ఉన్నప్పుడు ఎక్కడా నెమ్మదిగా ఆడాల్సిన అవసరం లేదు. అదే స్పీడ్‌ని కొనసాగించాలి... విరాట్ కోహ్లీ ఇది తెలియదా?’ అంటూ కామెంట్ చేశాడు కామెంటేటర్ సైమన్ ధుల్..
610
Babar Azam PSL
ఇంతకుముందు పాక్ సూపర్ లీగ్ 2023 సమయంలో బాబర్ ఆజమ్‌ని కూడా ఇదే విధంగా ట్రోల్ చేశాడు సైమన్ ధుల్. ‘టీమ్ కంటే నీ సెంచరీ ముఖ్యమైందా? ఎప్పుడైనా సెంచరీ వంటి వ్యక్తిగత మైలురాళ్లకు ఆఖరి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే ఇక్కడ మాత్రం టీమ్‌కి ఆఖరి ప్రాధాన్యం దక్కుతోంది. బౌండరీలు కొట్టకుండా ఎలాగైనా సెంచరీ పూర్తి చేసుకోవాలని చూస్తున్నాడు...
710
Babar Azam
సెంచరీలు చేయడం గొప్ప విషయమే. గణాంకాలు చాలా ముఖ్యమే. అయితే అన్నింటికంటే ముందు టీమ్ గెలవడం అవసరం. విజయాలే ప్రధానం...’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ ధుల్...
810
Simon Doull
అంతకుముందు పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్ సమయంలోనూ బాబర్ ఆజమ్‌ని బీభత్సంగా ట్రోల్ చేశాడు సైమన్ ధుల్. ‘ఇలాంటి తారు రోడ్డులాంటి పిచ్‌లను తయారుచేసి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. వాళ్ల కెప్టెన్ బాబర్ ఆజమ్‌ని ప్రపంచంలో గొప్ప బ్యాటర్‌గా చూపించాలని చూస్తోంది...
910
Virat kohli-Babar Azam
ఇలాంటి పిచ్‌లపై డబుల్ సెంచరీలు చేసి, అతను తన గణాంకాలను గొప్పగా చేసుకోవాలని అనుకుంటున్నాడు. అయితే దీని వల్ల టీమ్‌కి కానీ, క్రికెట్‌కి కానీ కలిగే ప్రయోజనం ఏంటి? విజయాలు లేకుండా కేవలం రికార్డులతో ఏం చేసుకుంటారు...’ అంటూ కామెంట్ చేశాడు సైమన్ ధుల్..
1010
Virat Kohli-Babar Azam
విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్‌ల వంటి స్టార్ క్రికెటర్లకు వ్యతిరేకంగా మాట్లాడడానికి చాలామంది కామెంటేటర్లు సాహసించరు. అయితే సైమన్ ధుల్ మాత్రం కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేస్తుంటాడు. విరాట్ కోహ్లీ గత ఇన్నింగ్స్‌పై చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయం కూడా ఇదే...