మన్కడింగ్ రనౌట్‌కి ప్రయత్నించి ఫెయిల్ అయిన హర్షల్ పటేల్... పెనాల్టీ వేయాలంటున్న బెన్ స్టోక్స్..

First Published Apr 11, 2023, 3:32 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌‌లో నడిచిన హైడ్రామా అంతా ఇంతా కాదు. 212 పరుగుల భారీ స్కోరు చేసిన బెంగళూరు, 105 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి లక్నోని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసింది. ఇక ఆర్‌సీబీ ఘన విజయం ఖాయమనుకున్న టైంలో మ్యాచ్‌ని మలుపు తిప్పారు ఆర్‌సీబీ బౌలర్లు...

(PTI PhotoShailendra Bhojak)(PTI04_10_2023_000253B)

ఐపీఎల్‌లో గత మూడు సీజన్లలో అట్టర్ ఫ్లాప్ అయిన నికోలస్ పూరన్, ఆర్‌సీబీ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. సింగిల్ తీయడమే తెలియనట్టుగా ఓ బౌండరీలతో ఢీల్ చేశాడు. మార్కస్ స్టోయినిస్ 30 బంతుల్లో 65 పరుగులు చేయగా 15 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న నికోలస్ పూరన్, 19 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 62 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

(PTI PhotoShailendra Bhojak)(PTI04_10_2023_000247B)

ఈ ఇద్దరూ అవుట్ అయ్యాక ఆయుష్ బదోనీ హిట్ వికెట్ కావడం, ఆ వెంటనే జయ్‌దేవ్ ఉనద్కట్, మార్క్ వుడ్ అవుట్ కావడంతో ఉత్కంఠ రేగింది. ఆఖరి ఓవర్‌లో నాలుగో బంతికి ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. ఐదో బంతికి ఉనద్కట్ వికెట్ తీశాడు హర్షల్ పటేల్...
 

Harshal Patel Mankading

చివరి బంతికి పరుగు ఇవ్వకపోతే చాలు... మ్యాచ్ టైగా ముగిసి, సూపర్ ఓవర్‌కి దారి తీస్తుంది. నాన్‌ స్ట్రైయికర్‌లో ఉన్న రవి భిష్ణోయ్, హర్షల్ పటేల్ బాల్ వేయకముందే పరుగు కోసం ముందుకు వెళ్లిపోయాడు. బౌలర్ హర్షల్ పటేల్‌కి రవి భిష్ణోయ్ ముందుగానే వెళ్లిపోతాడనే విషయం అర్థమైంది..

Image credit: PTI

అందుకే పక్కా ప్రణాళిక ప్రకారం అతన్ని మానడ్కింగ్ రనౌట్ చేయాలని అనుకున్నాడు. అదే జరిగి ఉంటే లక్నో సూపర్ జెయింట్స్ ఆలౌట్ అయిపోయి, మ్యాచ్ ఫలితం తేల్చేందుకు సూపర్ ఓవర్ అవసరమయ్యేది. అయితే ముందే అనుకున్నా హర్షల్ పటేల్ బాల్ వేసేందుకు ముందు వెళ్లిపోయి త్రో కొట్టడం, ఆలోపు రవి భిష్ణోయ్ క్రీజులోకి వచ్చేయడం జరిగిపోయాయి.. 

(PTI PhotoShailendra Bhojak)(PTI04_10_2023_000258B)

ఆ తర్వాతి బంతికి బైస్ రూపంలో సింగిల్ తీసిన ఆవేశ్ ఖాన్, లక్నో సూపర్ జెయింట్స్‌కి థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. మాన్కడింగ్ రనౌట్ చేయాలని అనుకుంటే అంత ముందుకు వెళ్లడం దేనికి, స్టంప్స్ దగ్గరే ఆగి కొట్టొచ్చు కదా అని బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేసిన విరాట్ కోహ్లీ సైగలు చేయడం కూడా కెమెరాల్లో కనిపించింది..

‘రవి భిష్ణోయ్ బాల్ వేయకముందే తన క్రీజుని దాటేశాడు. ఇప్పటికీ నాన్‌ స్ట్రైయికింగ్ ఎండ్‌లో రనౌట్ చేయకూడదని చెప్పే సిల్లీ పీపుల్ ఉన్నారా?’ అంటూ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు. దీనికి ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు...

‘నువ్వేం అనుకుంటున్నావ్ హర్ష? ఒకవేళ నాన్ స్ట్రైయికర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్, బాల్ వేయకముందే క్రీజు దాటి అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నిస్తే... అంపైర్లు 6 పెనాల్టీ పరుగులు ఇవ్వాలి. ఇలా చేస్తే బ్యాటర్లు బాల్ వేసే దాకా క్రీజులో ఉంటారు. ఎలాంటి వివాదాలు రావు...’ అంటూ ట్వీట్ చేశాడు బెన్ స్టోక్స్..

click me!