హెల్మెట్‌ని నేలకేసి కొట్టిన ఆవేశ్ ఖాన్... మందలించిన రిఫరీ! ఫాఫ్ డుప్లిసిస్‌కి భారీ జరిమానా...

Published : Apr 11, 2023, 04:05 PM ISTUpdated : Apr 11, 2023, 04:12 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ రసరంజకంగా సాగుతోంది. గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌తో పాటు ఆర్‌సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచులు ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగాయి. టైటాన్స్‌తో మ్యాచ్‌ని ఆఖరి ఓవర్‌లో 5 సిక్సర్లు బాది రింకూ సింగ్ ముగిస్తే, లక్నోకి ఆవేశ్ ఖాన్ విజయాన్ని అందించాడు...

PREV
19
హెల్మెట్‌ని నేలకేసి కొట్టిన ఆవేశ్ ఖాన్... మందలించిన రిఫరీ! ఫాఫ్ డుప్లిసిస్‌కి భారీ జరిమానా...
(PTI Photo/Shailendra Bhojak)(PTI04_10_2023_000192B)

విరాట్ కోహ్లీ 61, ఫాఫ్ డుప్లిసిస్ 79, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 59 పరుగులు చేయడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 20 ఓవర్లలో 2 వికెట్లు నష్టాపోయి 212 పరుగులు చేసింది. మొదటి రెండు మ్యాచుల్లో లక్నోకి ప్రధాన బ్యాటర్‌గా ఉన్న కైల్ మేయర్స్‌ని మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు...

29

కెఎల్ రాహుల్ 18, దీపక్ హుడా 9, కృనాల్ పాండ్యా డకౌట్ కాగా ఐదో స్థానంలో వచ్చిన మార్కస్ స్టోయినస్ 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 65 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 105 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది లక్నో. ఇక ఆర్‌సీబీ ఈజీగా గెలుస్తుందని అనుకున్నారంతా. అయితే ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..

39
Faf du Plessis and Avesh Khan

కెఎల్ రాహుల్ 18, దీపక్ హుడా 9, కృనాల్ పాండ్యా డకౌట్ కాగా ఐదో స్థానంలో వచ్చిన మార్కస్ స్టోయినస్ 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 65 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 105 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది లక్నో. ఇక ఆర్‌సీబీ ఈజీగా గెలుస్తుందని అనుకున్నారంతా. అయితే ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..

49

నికోలస్ పూరన్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 62 పరుగులు, ఆయుష్ బదోనీ 24 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేసి మ్యాచ్‌ని మలుపు తిప్పారు. ఈ ఇద్దరూ అవుట్ అయ్యాక వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఆఖరి ఓవర్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయానికి 5 పరుగులు కావాల్సి వచ్చాయి. ఒక్క సిక్సర్ కొడితే మ్యాచ్ మొదటి బంతికే అయిపోయేది.

59
Harshal Patel Mankading

అయితే తొలి బంతికి జయ్‌దేవ్ ఉనద్కట్ సింగిల్ తీయగా రెండో బంతికి మార్క్‌వుట్ అవుట్ అయ్యాడు. మూడో బంతికి రవి భిష్ణోయ్ 2 పరుగులు తీశాడు. నాలుగో బంతికి సింగిల్ తీసిన భిష్ణోయ్, స్కోర్లు సమం చేసేశాడు. ఐదో బంతికి జయ్‌దేవ్ ఉనద్కట్ అవుట్ అయ్యాడు. చివరి బంతికి కూడా భారీ హైడ్రామా నడిచింది..

69
Image credit: PTI

హర్షల్ పటేల్ మన్కడింగ్ రనౌట్‌కి ప్రయత్నించడం, అయితే అప్పటికే అతను బౌలింగ్ యాక్షన్ పూర్తి చేసుకోవడంతో ఆర్‌సీబీకి లక్ కలిసి రాలేదు. చివరి బంతి ఆడేందుకు ప్రయత్నించిన ఆవేశ్ ఖాన్, బ్యాటును టచ్ చేయలేకపోయాడు. అయితే అప్పటికే రవి భిష్ణోయ్, ఉసేన్ బోల్డ్ స్టైల్‌లో పరుగు చేయడం, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ బంతిని అందుకోవడంలో తలబడి, ఆలస్యం చేయడంతో ఆవేశ్ ఖాన్ సింగిల్ పూర్తి చేసేశాడు..
 

79
Image credit: PTI

సింగిల్ పూర్తయిన తర్వాత తన హెల్మెట్ తీసి, నేల మీద కొట్టి సెలబ్రేట్ చేసుకున్నాడు ఆవేశ్ ఖాన్. బౌలింగ్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన ఆవేశ్ ఖాన్, బ్యాటింగ్‌లో ఒక్క పరుగు చేయలేకపోయాడు. బైస్ రూపంలో వచ్చిన పరుగుకి లక్నో గెలిచింది. అయినా ఓవర్ యాటిట్యూడ్ చూపించిన ఆవేశ్ ఖాన్‌పై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది..
 

89
Image credit: PTI

ట్రోలింగ్ పక్కనబెడితే క్రికెట్ హెల్మెట్‌ని నేలకేసి కొట్టి, క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించినందుకు ఆవేశ్ ఖాన్‌ని మందలించి వదిలేశాడు మ్యాచ్ రిఫరీ. ఆవేశ్ ఖాన్ కూడా తన తప్పును అంగీకరించడంతో భారీ జరిమానా నుంచి తప్పుకున్నాడు...

99
Image credit: PTI

మరోవైపు స్లో ఓవర్ రేటు కారణంగా రాయల్ ఛలెంజర్స్ బెంగళూరు టీమ్ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్‌కి రూ.12 లక్షల జరిమానా పడింది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి ఇది తొలి తప్పిదం కావడంతో కేవలం కెప్టెన్‌కి మాత్రమే జరిమానా పడింది. మరోసారి రిపీట్ అయితే టీమ్ మొత్తానికి పడుతుందని హెచ్చరించింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్.. 

click me!

Recommended Stories