Virat Kohli: ఇద్ద‌రు పాక్ దిగ్గ‌జాల రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన విరాట్ కోహ్లీ

First Published | Jan 4, 2024, 11:23 AM IST

Virat Kohli: భార‌త స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత కొన‌సాగుతోంది. తాజాగా ఇద్ద‌రు దిగ్గ‌జ క్రికెట‌ర్స్, పాకిస్తాన్ మాజీ కెప్టెన్లు ఇంజమామ్ ఉల్ హక్, జావేద్ మియాందాద్ రికార్డులను కోహ్లీ బ‌ద్ద‌లు కొట్టాడు. 
 

Virat Kohli breaks the record of two Pakistani legends: ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భార‌త్ చెత్త రికార్డుతో బ్యాట‌ర్స్ ఫెవిలియ‌న్ కు క్యూక‌ట్టారు. అయితే, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భార‌త స్టార్ ప్లేయ‌ర్ కింగ్ విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 46 పరుగులు చేశాడు. ఈ ప‌రుగుల‌తో మ‌రో రికార్డును బ్రేక్ చేశాడు.  పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు దిగ్గ‌జ క్రికెట‌ర్ల రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. 
 

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో 38, 76 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ వీవీఎస్ లక్ష్మణ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. భార‌త జ‌ట్టు త‌ర‌ఫున అత్యధిక పరుగులు చేసిన 4వ ఆటగాడిగా నిలిచాడు. ఇక కేప్ టౌన్ లో జ‌రుగుతున్న రెండో టెస్టులో 46 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ  టెస్టు క్రికెట్‌లో 8836 పరుగులు చేశాడు. దీంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్లు ఇంజమామ్-ఉల్-హక్, జావేద్ మియాందాద్‌ల రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచంలోని 19వ క్రికెట‌ర్ గా కోహ్లీ నిలిచాడు.

Latest Videos


Image credit: PTI

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్ తన కెరీర్‌లో ఆడిన 120 టెస్టు మ్యాచ్‌ల్లో 49.60 సగటుతో 8830 పరుగులు చేయ‌గా, ఇందులో 25 సెంచరీలు, 46 అర్ధసెంచరీలు ఉన్నాయి. మ‌రో పాక్ దిగ్గ‌జ క్రికెట‌ర్ జావేద్ మియాందాద్ 124 మ్యాచ్‌ల్లో 52.57 సగటుతో 23 సెంచరీలు, 43 అర్ధసెంచరీలతో 8832 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ వీరి రికార్డుల‌ను అధిగ‌మిస్తూ.. 189 ఇన్నింగ్స్‌ల్లో 49.38 సగటుతో 29 సెంచరీలు, 30 అర్ధసెంచరీలతో 8836 పరుగులు చేశాడు.
 

Image credit: PTI

ద‌క్షిణాఫ్రికా-భార‌త్ టెస్టు సిరీస్ లో బాక్సింగ్ డే టెస్టులో విరాట్ కోహ్లీ 38, 76 పరుగులతో టీమిండియా తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 46 పరుగులు చేసి భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ లో విరాట్, రోహిత్ శ‌ర్మ‌,శుభ్ మ‌న్ గిల్ మిన‌హా మిగ‌తా అంద‌రూ ప్లేయ‌ర్లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు.

click me!