Virat Kohli: చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ.. చ‌రిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ

Published : Apr 20, 2025, 07:52 PM IST

PBKS vs RCB IPL 2025: విరాట్ కోహ్లీ సూప‌ర్ నాక్ తో ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ పై  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈజీగానే విక్ట‌రీ అందుకుంది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ ఛేజింగ్‌లో అద్భుత‌మైన బ్యాటింగ్  తో పంజాబ్ ను వారి హోం గ్రౌండ్ లో ఓడించారు. ఈ క్ర‌మంలోనే విరాట్ కోహ్లీ డేవిడ్ వార్న‌ర్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.  

PREV
15
Virat Kohli: చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ.. చ‌రిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ

IPL Virat Kohli: భారత స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో మరో గొప్ప మైలురాయిని అందుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మరోసారి తన ఆధిపత్యాన్ని చూపించాడు. ఐపీఎల్ 2025లో ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరపున అద్భుతమైన బ్యాటింగ్ తో కింగ్ కోహ్లీ మరో హాఫ్ సెంచరీ కొట్టాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఇన్నింగ్స్‌లలో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. అలాగే, ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 

25

ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ 67వ సారి 50+ పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో వార్నర్ 66 సార్లు 50+ పరుగులు చేశాడు. అతని ఖాతాలో 4 సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు వార్నర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. 

ఐపీఎల్‌లో అత్యధిక 50+ స్కోర్లు సాధించిన టాప్-5 ప్లేయర్లు వీరే:

67- విరాట్ కోహ్లీ (8 సెంచరీలు)
66- డేవిడ్ వార్నర్ (4 సెంచరీలు)
53- శిఖర్ ధావన్ (2 సెంచరీలు)
45- రోహిత్ శర్మ (2 సెంచరీలు)
43- కేఎల్ రాహుల్ (4 సెంచరీలు)

35
Virat Kohli

అద్భుతమైన ఫామ్‌లో విరాట్ కోహ్లీ

ఐపీఎల్‌ 2025లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 8 మ్యాచ్‌ల్లో 8 ఇన్నింగ్స్‌లలో 322 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కింగ్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. 64.40 సగటు, 140 స్ట్రైక్ రేట్ తో కోహ్లీ బ్యాటింగ్ కొనసాగింది. ఇందులో కోహ్లీ 4 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు.

ఐపీఎల్‌ 2025లో కోహ్లీ చేజింగ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 36 బంతుల్లో అజేయంగా 62, రాజస్థాన్ రాయల్స్‌పై 45 బంతుల్లో అజేయంగా 62, పంజాబ్‌పై 43 బంతుల్లో అజేయంగా 73 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత ఐదు ఇన్నింగ్స్‌లలో కోహ్లీ నాలుగో హాఫ్ సెంచరీని సాధించడం విశేషం. ఈ 5 ఇన్నింగ్స్ లలో కోహ్లీ పరుగులు వరుసగా 59, 77, 92, 1, 73* గా ఉన్నాయి. 

45
Virat Kohli (Photo- IPL)

కోహ్లీ ఐపీఎల్ కెరీర్  

విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఒకే జట్టుకు ఆడుతున్న ప్లేయర్ గా గుర్తింపు సాధించాడు. అలాగే, ఐపీఎల్ 8వేలకు పైగా పరుగులు చేసిన ప్లేయర్. 

విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో 260 మ్యాచ్ లను ఆడి 8326 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 59 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 113* పరుగులు. ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. అలాగే, అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ కూడా కోహ్లీనే. అద్భుతమైన ఫీల్డింగ్ తో అత్యధిక క్యాచ్ లు పట్టిన ప్లేయర్లలో ఒకరిగా ఉన్నాడు.

55
Virat Kohli

పంజాబ్ పై ఆర్‌సీబీ విక్టరీ 

చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓడించింది. విరాట్ కోహ్లీ 54 బంతుల్లో అజేయంగా 73 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 135.19గా ఉంది. కోహ్లీతో పాటు దేవదత్ పాడిక్కల్ 35 బంతుల్లో 61 పరుగులు చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులతో విజయం సాధించింది.
 

Read more Photos on
click me!

Recommended Stories