Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi: కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మాత్రమే కాదు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అవుతున్న పేరు వైభవ్ సూర్యవంశీ. అవును తన అరంగేట్రంతోనే ఐపీఎల్ లో సంచలనం రేపి ప్రశంసలు అందుకుంటున్నాడు.
కేవలం 14 ఏళ్ల వయస్సులో ఐపీఎల్ లో అడుగుపెట్టి అతిపిన్న వయస్కుడైన ప్లేయర్ గా రికార్డు సాధించాడు. ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేశాడు. అతని పై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
వైభవ్ సూర్యవంశి
ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి ఇరగదీశాడు !
రాజస్థాన్ జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశి ఐపీఎల్ చరిత్రలోనే అతి చిన్న వయసులో ఐపీఎల్ ఆడుతున్న ప్లేయర్ గా రికార్డు సాధించాడు. భారీ అంచనాల నడుమ బ్యాటింగ్ ప్రారంభించిన వైభవ్ తొలి బంతికే సిక్సర్ అదరగొట్టాడు.
మొత్తంగా 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. 14 ఏళ్లకే ఐపీఎల్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఇంటర్నెట్ హాట్ టాపిక్.
వైభవ్ సూర్యవంశీపై సుందర్ పిచాయ్ ప్రశంసలు
చిన్న వయస్సులోనే ఐపీఎల్ అరంగేట్రం చేస్తూ తొలి మ్యాచ్ లో మంచి ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ CEO సుందర్ పిచాయ్ కూడా వైభవ్ సూర్యవంశీని పొగడ్తలతో ముంచెత్తాడు.
వైభవ్ సూర్యవంశి
గూగుల్ సీఈఓ సందర్ పిచాయ్ 8వ తరగతి చదువుతున్న వైభవ్ సూర్యవంశీపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అతని ఆటను చూడ్డానికి ప్రత్యేకంగా నిద్ర లేచినట్టు కామెట్స్ చేశారు. అలాగే, వైభవ్ సూర్యవంశీ లైవ్ యాక్షన్ చూసేందుకు ఎదురు చూశాననీ, వాట్ ఏ డెబ్యూట్ అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
వైభవ్ సూర్యవంశీపై సుందర్ పిచాయ్ ట్వీట్