MS Dhoni: సిక్సర్ల మోత.. ధోని సూపర్ రికార్డు !

Published : Apr 20, 2025, 06:55 PM IST

ms dhoni sixer records: ఐపీఎల్ లో అత్యధిక మ్యాచ్ ల‌కు కెప్టెన్సీ వహించిన ప్లేయ‌ర్ ఎంఎస్ ధోని. అలాగే, ఐపీఎల్ లో అత్యంత విజ‌య‌వంత‌మైన కెప్టెన్. ఐదు సార్లు చెన్నై సూపర్ కింగ్ (సీఎస్కే) ను చాంపియ‌న్ గా నిల‌బెట్టాడు. ముంబై తో జ‌రిగే మ్యాచ్ లో ధోని మ‌రో సూప‌ర్ రికార్డు సాధించ‌నున్నాడు.   

PREV
15
MS Dhoni: సిక్సర్ల మోత.. ధోని సూపర్ రికార్డు !
MS Dhoni

ms dhoni sixer records: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో 2024 సీజ‌న్ కు ముందు ధోని చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్సీని వ‌దులుకుని రుతురాజ్ గైక్వాడ్ కు అప్ప‌గించాడు. ఆ త‌ర్వాత ప్లేయ‌ర్ గా జ‌ట్టులో కొనసాగుతున్నాడు. అయితే, ఐపీఎల్ 2025లో రుతురాజ్ గైక్వాడ్ గాయం కార‌ణంగా ఈ ఎడిష‌న్ కు మొత్తంగా దూరం అయ్యాడు. దీంతో మ‌ళ్లీ ధోని చెన్నై సూపర్ కింగ్స్ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. 

25
CSK captain MS Dhoni (Photo/ @ipl/X)

ఎంఎస్ ధోని ప్ర‌పంచ క్రికెట్ లెజెండ‌రీ ప్లేయ‌ర్. భార‌త జ‌ట్టుకు అద్భుతమైన విజ‌యాలు అందించాడు. ఐసీసీ టోర్న‌మెంట్ల‌లో మూడు ట్రోఫీల‌ను భార‌త జ‌ట్టుకు అందించాడు. ఇక ఐపీఎల్ లో కూడా ధోని అత్యంత విజ‌య‌వంత‌మైన కెప్టెన్. అత్య‌ధిక మ్యాచ్ ల‌కు కెప్టెన్ గా కొన‌సాగ‌డ‌మే కాకుండా ఐదు సార్లు చెన్నై టీమ్ కు ఐపీఎల్ టైటిళ్ల‌ను అందించాడు. 

35
MS Dhoni

ఐపీఎల్ 2025 38వ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్, ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. క్రికెట్ లో అనేక రికార్డులు సాధించిన ధోని.. ఈ మ్యాచ్ లో మ‌రో సూప‌ర్ రికార్డు కూడా సాధించ‌నున్నాడు. 

ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని 4 సిక్సర్లు కొడితే తన టీ20 కెరీర్‌లో 350 సిక్సర్లు పూర్తి చేసుకుంటాడు. ధోని ఇప్పటివరకు 398 టీ20 మ్యాచ్‌ల్లో 346 సిక్సర్లు, 527 ఫోర్లు బాదాడు. ఈ మ్యాచ్ లో 350 సిక్సర్లు పూర్తి  చేసి ప్ర‌త్యేక క్ల‌బ్ లో చేర‌తాడు.

45
MS Dhoni

ఇప్పటివరకు ధోని టీ20 కెరీర్ గమనిస్తే మొత్తం 398 మ్యాచ్ లు ఆడి 7562 పరుగులు చేశాడు. అతని అత్యధిక వ్యక్తి గత స్కోర్ 84* పరుగులు. 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ధోని తన టీ20 కెరీర్ లో 527 ఫోర్లు, 346 సిక్సర్లు బాదాడు. 

 

55
CSK’s New Captain and Wicket-Keeper – IPL 2025

ఇక ఐపీఎల్ లో ధోని రికార్డులు చాలానే ఉన్నాయి. కెప్టెన్ గా అత్యధిక మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ ఎంఎస్ ధోని. ఐపీఎల్ లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ ధోని. 226 మ్యాచ్‌లలో 133 విజయాలు అందించాడు. ఐపీఎల్‌లో అత్యధికంగా 8 సార్లు టీమ్ ను ఫైనల్‌కు తీసుకెళ్లిన కెప్టెన్ ధోని. అలాగే, అత్యధికంగా 5 టైటిళ్లు గెలిచి రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు.

Read more Photos on
click me!

Recommended Stories