ఆరేళ్ల తర్వాత బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ... టీమిండియా ఫ్యాన్స్ హ్యాపీ...

Published : Sep 01, 2022, 03:47 PM IST

గత రెండు నెలలుగా విరాట్ కోహ్లీ ఫామ్ గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. కొందరు ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీని పక్కనబెట్టాలని కామెంట్లు చేస్తే, మరికొందరు అతను ఫామ్‌లో ఉన్నా లేకున్నా టీమ్‌లో ఉండాల్సిందేనని కామెంట్లు చేశారు... 

PREV
16
ఆరేళ్ల తర్వాత బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ... టీమిండియా ఫ్యాన్స్ హ్యాపీ...
virat surya

నెల రోజుల గ్యాప్ తర్వాత ఆసియా కప్ 2022 ద్వారా రీఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, ఆసియా కప్ 2022 టోర్నీలో మొదటి రెండు ఇన్నింగ్స్‌ల్లో చక్కని ప్రదర్శనతో మెప్పించాడు...

26

పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 34 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, హంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 బంతుల్లో  ఓ ఫోర్, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...

36
Image credit: Getty

ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, దాదాపు ఆరు నెలల తర్వాత ఈ ఏడాది రెండో టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 2 మ్యాచుల్లో 94 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ఆసియా కప్ 2022 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు...

46

హంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యాకి రెస్ట్ ఇవ్వడంతో టీమిండియాకి ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకుండాపోయింది. దీంతో భారత జట్టుకి ఆరో బౌలర్‌గా మారాడు విరాట్ కోహ్లీ...

56
kohli bowling

193 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన హంగ్ కాంగ్, కాస్తో కూస్తో పోరాడినా లక్ష్యం దిశగా సాగలేదు. హంగ్ కాంగ్ విజయానికి 24 బంతుల్లో 84 పరుగులు కావాల్సిన దశలో 17వ ఓవర్ బౌలింగ్ చేశాడు విరాట్ కోహ్లీ... ఈ ఓవర్‌లో 6 పరుగులు మాత్రమే ఇచ్చిన విరాట్ కోహ్లీ, ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో బౌలింగ్ చేశాడు. విరాట్ కోహ్లీకి టీ20 ఫార్మాట్‌లో 4 వికెట్లు కూడా ఉన్నాయి...

66
Image credit: PTI

18వ ఓవర్ వేసిన భువీ 4 పరుగులు ఇవ్వగా 19వ ఓవర్ వేసిన ఆవేశ్ ఖాన్ ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ 12 పరుగులు ఇచ్చాడు. అనుభవం లేని యంగ్ బౌలర్ల కంటే సీనియర్ విరాట్ కోహ్లీకి పొదుపుగా బౌలింగ్ చేసి మెప్పించాడు...

Read more Photos on
click me!

Recommended Stories