పంత్‌నే కాదు, రోహిత్‌ని పక్కనబెట్టినా గెలవగలరు... టీమిండియాపై రికీ పాంటింగ్...

First Published Sep 1, 2022, 1:22 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో రెండు వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌కి దూసుకెళ్లింది టీమిండియా. పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న భారత జట్టు, హంగ్ కాంగ్‌పై 40 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ని, హంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యాని పక్కనబెట్టింది భారత జట్టు...

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ని ఆడించడం హాట్ టాపిక్ అయ్యింది. హంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో పంత్ తుదిజట్టులోకి వచ్చినా దినేశ్ కార్తీక్‌ని కొనసాగించింది భారత జట్టు...

Rishabh Pant

‘రిషబ్ పంత్ లేకుండా పాక్‌తో మ్యాచ్ ఆడడం నాకు నిజంగానే సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. దీని గురించి చాలా పెద్ద చర్చే జరిగింది. హంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యాని పక్కనబెట్టేశారు...

ఢిల్లీ క్యాపిటల్స్‌కి పని చేయడం వల్ల రిషబ్ పంత్‌ని చాలా ఏళ్లుగా దగ్గర్నుంచి చూస్తున్నాను. అతను అద్భుతమైన ప్లేయర్ మాత్రమే కాదు, చాలా టాలెంటెడ్ కెప్టెన్ కూడా. అయితే టీమిండియాలో మ్యాచ్ విన్నర్లకు కొదవ లేదు..

రిషబ్ పంత్ కాదు కదా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను పక్కనబెట్టి కూడా వాళ్లు గెలవగలరు. ఆ టీమ్‌లో ప్లేయర్లు అలా ఉన్నారు. రిషబ్ పంత్‌కి తన సత్తా ఏంటో బాగా తెలుసు. మ్యాచ్‌లను ఎలా గెలిపించాలో ఇంకా బాగా తెలుసు...

నాకు తెలిసి రిషబ్ పంత్‌ని ఎక్కువ రోజులు పక్కనబెట్టడం కూడా వీలయ్యే పని కాదు. అందుకే హంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌లో ఆడించారు. పాక్‌పై సూపర్ ఇన్నింగ్స్ తర్వాత హార్ధిక్ పాండ్యాకి రెస్ట్ ఇవ్వడం సరైన నిర్ణయమే...

Image credit: PTI

ఎంత మంది ప్లేయర్లను మార్చినా టీమ్ బ్యాలెన్స్ తప్పకుండా చూసుకుంటున్నారు. ఏ జట్టుకైనా కావాల్సింది అదే. దినేశ్ కార్తీక్ కెరీర్ పీక్ ఫామ్‌లో ఉన్నాడు. అలాంటి ప్లేయర్‌ని పక్కనబెట్టడం కుదరని పని... దినేశ్ కార్తీక్ టీమ్‌లోకి కమ్‌బ్యాక్ ఇవ్వడంతో సెలక్టర్లకు చాలా పెద్ద పని పడింది...

Image credit: Getty

దినేశ్ కార్తీక్ కోసం రిషబ్ పంత్‌లాంటి స్టార్ క్వాలిటీ ప్లేయర్ కూడా రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సి వస్తోంది. టీమిండియా ఎంత పటిష్టమైన జట్టు అనేది చెప్పడానికి ఇదే పర్పెక్ట్ ఉదాహరణ. వారిని ఓడించడం అంత తేలికైన విషయం కాదు...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్...

click me!