కెఎల్ రాహుల్‌ని ట్రోల్ చేసిన పంజాబ్ కింగ్స్... మాజీ కెప్టెన్ అని చూడకుండా క్లాస్‌గా...

Published : Sep 01, 2022, 12:43 PM IST

గాయం నుంచి కోలుకున్న తర్వాత కెఎల్ రాహుల్  తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ అయితే ఇప్పటిదాకా ఒక్కటి కూడా ఆడలేకపోయాడు. జింబాబ్వే టూర్‌లో ఫెయిల్ అయిన కెఎల్ రాహుల్, ఆసియా కప్ 2022లో మొదటి రెండు మ్యాచుల్లో పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...

PREV
16
కెఎల్ రాహుల్‌ని ట్రోల్ చేసిన పంజాబ్ కింగ్స్... మాజీ కెప్టెన్ అని చూడకుండా క్లాస్‌గా...
KL Rahul

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ అయిన కెఎల్ రాహుల్, హంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతులు ఆడి 2 సిక్సర్లతో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు... రాహుల్ ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్ కూడా లేకపోవడం విశేషం...

26
KL Rahul Bowled

జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో 46 బంతులు ఆడి ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, హంగ్‌ కాంగ్ వంటి చిన్న జట్టుపై కూడా వేగంగా పరుగులు చేయలేకపోయాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన ఎఫెక్ట్, రాహుల్ బ్యాటింగ్‌లో స్పష్టంగా కనిపించింది...

36

కెఎల్ రాహుల్ అవుటైన తర్వాత పంజాబ్ కింగ్స్ వేసిన ట్వీట్ షాట్ టాపిక్ అయ్యింది. ‘టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 39 బంతుల్లో 36 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, సాలిడ్ ఇన్నింగ్స్ తర్వాత అవుట్ అయ్యాడు...’ అంటూ ట్వీట్ చేసింది పంజాబ్ కింగ్స్...

46

పంజాబ్ కింగ్స్‌కి రెండు సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు కెఎల్ రాహుల్. 2020 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన కెఎల్ రాహుల్, 2021 సీజన్‌లోనూ 600+ పరుగులు చేశాడు. అయితే కెప్టెన్‌గా పంజాబ్ జట్టును మాత్రం ప్లేఆఫ్స్‌కి చేర్చలేకపోయాడు...

56
Image Credit: PTI

ఐపీఎల్ 2022 సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రూ.17 కోట్ల భారీ ఆఫర్ రావడంతో పంజాబ్ కింగ్స్ నుంచి బయటికి వచ్చేశాడు కెఎల్ రాహుల్. రాహుల్ హ్యాండ్ ఇవ్వడంతో మయాంక్ అగర్వాల్‌కి కెప్టెన్సీ అప్పగించింది పంజాబ్ కింగ్స్...

66

పంజాబ్ కింగ్స్‌ని ప్లేఆఫ్స్ చేర్చలేకపోయినా కెప్టెన్‌గా తొలి సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ని ప్లేఆఫ్స్ చేర్చాడు కెఎల్ రాహుల్. దీంతో ఈ కోపాన్ని మనసులో పెట్టుకున్న పంజాబ్ కింగ్స్, రాహుల్ స్లో ఇన్నింగ్స్‌ని ‘సాలిడ్’ అంటూ సంభోదించి...ఇన్‌డైరెక్ట్‌గా ట్రోల్ చేసిందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. 

click me!

Recommended Stories