Top 5 ODI Batsmen : సచిన్ కాదు.. కోహ్లీ కాదు.. ఏబీ డివిలియర్స్ లిస్టులో నెం.1 క్రికెటర్ ఎవరు?

Published : Mar 07, 2025, 02:06 PM IST

Top 5 ODI Batsmen: క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన వన్డే బ్యాటర్ల పై మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే, అతని లిస్టులో స్థానం సంపాదించిన టాప్-5 వన్డే క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
Top 5 ODI Batsmen : సచిన్ కాదు.. కోహ్లీ కాదు.. ఏబీ డివిలియర్స్ లిస్టులో నెం.1 క్రికెటర్ ఎవరు?

AB de Villiers top 5 ODI cricket batsmen: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, విధ్వంసకర బ్యాటర్ ఏబీ డివిలియర్స్  వన్డే క్రికెట్ చరిత్రలో తన టాప్ ఐదుగురు బ్యాటర్లను ఎంపిక చేశారు. డివిలియర్స్ ఎంపికలో ఫినిషింగ్ సామర్థ్యం, బ్యాటింగ్ స్థిరత్వం, నాయకత్వ లక్షణాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఆ లక్షణాలతోనే వారు తన టాప్-5  లిస్టులో నిలిచారని చెప్పారు. ఆ ప్లేయర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

26

1. ఎంఎస్. ధోని 

ఏబీ డివిలియర్స్ అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో మొదటి ఎంపిక భారత మాజీ కెప్టెన్ ఎంఎస్. ధోని. వన్డే క్రికెట్ ఫార్మాట్‌లో ధోని దూకుడు విధానం, అసాధారణ ఫినిషింగ్ సామర్థ్యం, ఒత్తిడిలో మ్యాచ్ పరిస్థితిని చక్కదిద్దడంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. భారత మాజీ కెప్టెన్ ధోని మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసేవారు. ఎంఎస్. ధోని వన్డేలలో గొప్ప నాయకులలో ఒకరు. 200 మ్యాచ్‌లలో టీమ్ ఇండియాకు నాయకత్వం వహించి 110 విజయాలు అందించారు. 2011 ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాయాల్లో భారత జట్టును ముందుకు నడిపించాడు. ధోని 350 మ్యాచ్‌లు ఆడి 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు సహా 50.57 సగటుతో 10773 పరుగులు చేశాడు.

36

2. విరాట్ కోహ్లీ 

ఏబీ డివిలియర్స్ అత్యుత్తమ బ్యాటర్‌లలో రెండవ ఎంపిక అతని స్నేహితుడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు సహ ఆటగాడు విరాట్ కోహ్లీ. ఒకటిన్నర దశాబ్దాలుగా భారత్‌కు బ్యాటింగ్ వెన్నెముకగా కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 2008లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరపున ODIలోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి అద్భుతమైన అనేక ఇన్నింగ్స్ లను ఆడుతూ గొప్ప వన్డే బ్యాటర్లలో ఒకరిగా తనను తాను నిరూపించుకున్నాడు.

ఇటీవల విరాట్ కోహ్లీ 14,000 వన్డే పరుగుల మైలురాయిని పూర్తి చేశాడు. ఈ మైలురాయిని (287 ఇన్నింగ్స్‌లు) సాధించిన వేగవంతమైన బ్యాటర్‌గా నిలిచాడు. అతను ODIలలో అత్యధిక సెంచరీలు (51) చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. కోహ్లీ 301 మ్యాచ్‌లలో 51 సెంచరీలు, 74 అర్ధ సెంచరీలు సహా 58.11 సగటుతో 14180 పరుగులు చేశాడు.

46

3. సచిన్ టెండూల్కర్

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను తన జాబితాలో మూడవ స్థానంలో ఉంచాడు. టెండూల్కర్ ప్రపంచ క్రికెట్ చరిత్రతో గొప్ప ప్లేయర్. అతను 463 మ్యాచ్‌లలో 44.83 సగటుతో 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలు సాధించాడు. అలాగే, 18,426 పరుగులతో రికార్డు సాధించాడు. టెండూల్కర్ ODI క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడు, 2010లో దక్షిణాఫ్రికాపై ఈ ఘనత సాధించాడు. భారత్‌కు అత్యంత దూకుడుగా ఆడే ఓపెనర్లలో సచిన్ ఒకరు. 2011లో 28 సంవత్సరాల తర్వాత భారత జట్టు వన్డే ప్రపంచ కప్ గెలవడంలో టెండూల్కర్ కీలక పాత్ర పోషించాడు. 

56

4. రికీ పాంటింగ్ 

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అత్యుత్తమ ఐదు వన్డే బ్యాటర్లలో నాల్గవ స్థానంలో ఉంచారు ఏబీ డివిలియర్స్. దూకుడు బ్యాటింగ్, పుల్-షాట్‌ను పరిపూర్ణంగా ఆడటంటో పాంటింగ్ గుర్తింపు పొందారు. అతని కాలంలోని అత్యంత భయానక బ్యాటర్లలో ఒకరిగా కూడా ఉన్నాడు. అసాధారణ బ్యాటర్‌గా ఉండటమే కాకుండా, పాంటింగ్ అద్భుతమైన నాయకుడు కూడా. 2003, 2007లో ఆస్ట్రేలియాను ODI ప్రపంచ కప్  ట్రోఫీ గెలిపించాడు. రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా తరపున 375 మ్యాచ్‌లు ఆడి 30 సెంచరీలు, 82 అర్ధ సెంచరీలు సహా 42.03 సగటుతో 13,704 పరుగులు చేశాడు.

66

5. జాక్వెస్ కల్లిస్ 

ఏబీ డివిలియర్స్ టాప్ 5 బ్యాటర్లలో చివరి ఆటగాడు అతని దక్షిణాఫ్రికా సహ ఆటగాడు జాక్వెస్ కల్లిస్. కల్లిస్ కేవలం బ్యాటర్ మాత్రమే కాదు, అత్యుత్తమ ఆల్‌రౌండర్  కూడా, అతను తన బలమైన బ్యాటింగ్‌తో ODIలలో ప్రోటీస్ జట్టు విజయంలో గణనీయమైన కృషి చేశాడు. కల్లిస్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. దక్షిణాఫ్రికా తరపున 328 ODIలలో, జాక్వెస్ కల్లిస్ 17 సెంచరీలు, 86 అర్ధ సెంచరీలు సహా 44.36 సగటుతో 11,579 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో కల్లిస్ 31.79 సగటు, 4.84 ఎకానమీ రేటుతో 273 వికెట్లు తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్ లో 10,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన, 250 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏకైక ఆల్‌రౌండర్ అతనే.

Read more Photos on
click me!

Recommended Stories